సాధార‌ణంగా చాలా మంది జిడ్డు చ‌ర్మంతో బాధ‌ప‌డుతుంటారు. కాలం ఏదయినా వీరికి చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది. చర్మం నుండి అధిక జిడ్డు స్రవించడం వలన వివిధ రకాల దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా మనల్ని వేధించే సమస్య మొటిమలు మ‌రియు వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు అని చెప్పవచ్చు. అదే స‌మ‌యంలో మేక‌ప్ చేసుకున్న తక్కువ సమయంలోనే మళ్లీ నిర్జీవంగా మారుతుంది. అందుకే ఈ జిడ్డు చ‌ర్మాన్ని వ‌దిలించుకోవ‌డానికి ఎన్నో రకాల క్రీములు వాడ‌తారు. కానీ, ఫ‌లితం లేక స‌త‌మ‌త‌మ‌వుతారు.

 

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.. జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్ట‌వ‌చ్చు. సిట్రిక్ లక్షణాలు కలిగిఉన్న నిమ్మరసం మీ చర్మం నుండి అదనపు జిడ్డును సమర్ధవంతంగా పీలుస్తుంది. ఒక కాటన్ బాల్ ని తాజా నిమ్మరసంలో ముంచండి, దాన్ని మీ ముఖం, మేడపై సున్నితంగా అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు మంచి ఫ‌లితం పొందొచ్చు. అలాగే ముఖానికి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తేనెని రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే చక్కని ఫలితాన్ని గమనించవచ్చు.

 

అదేవిధంగా, ఐస్ మనం చర్మంలో ఉన్న అధిక జిడ్డు సమస్యను పరిష్కరించగలదు. ఐస్ ముక్కని నేరుగా కాకుండా ఒక మెత్తటి కాటన్ వస్త్రంలో ఉంచి ముఖం మీద రుద్దడం వలన జిడ్డు సమస్యను నివారించ‌గ‌లం. అలాగే ఒక స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పట్ట‌డం మీరే గ‌మ‌నిస్తారు. ఇక విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే వాటిల్లో టొమాటో ఒకటి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు టొమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది..

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: