కోడిగుడ్డు(ఎగ్‌).. ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గుడ్డులో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి వాటి బారినపడకుండా కాపాడతాయి. మ‌రియు ఎగ్ వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అందుకే డాక్ట‌ర్లు సైతం ప్ర‌తిఒక్క‌రిని ఎగ్ తిన‌మంటారు. అయితే గుడ్డు ఆరోగ్యానికే కాదు.. చ‌ర్మానికి కూడా మేలు చేస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. అయితే ఎగ్‌ను ఉప‌యోగించ‌డానికి కొంద‌రు నిరాక‌రిస్తున్నారు.

 

వాస‌న లేదా ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల చాలా మంది గుడ్డును చ‌ర్మానికి యూజ్ చేయ‌రు. కానీ, గుడ్డు చ‌ర్మాన్ని మెరిపించ‌డంలో చాలా గ్రీట్‌గా ప‌నిచేస్తుంది. ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ అవకాడో, అంతే మోతాదులో పెరుగు బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. స్మూత్ గా మారుతుంది. అలాగే కోడిగుడ్డు తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్ నూనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. 

 

అదేవిధింగా, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని.. అందులో కొద్దిగా పచ్చిపాలు, అరటీస్పూన్ పసుపు, ఒక స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కొత్తమెరుపుని సంత‌రించుకుంటుంది. మ‌రియు ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తుంది. ఇక ఒక టేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్, ఒక ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల.. వెంటనే చర్మంలో గ్లోయింగ్ పెరుగుతుంది.

 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: