సాధార‌ణంగా ముఖం ఎంత అందంగా, కాంతివంతంగా ఉన్నా.. మెడ అందంగా లేక‌పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సబ్బుతో రుద్ది కడిగినా, స్క్రబ్ చేసి మృతకణాలు తొలగించినా, ప్యాక్ వేసి చర్మం బిగుతుగా చేసినా...అన్నీ ముఖానికి మాత్రమే పరిమితం చేస్తాం. కానీ దానికి అంటుకొని ఉన్న మెడను మాత్రం మనది కాదన్నట్టు అనాథగా వదిలేస్తాం. దీంతొ కొందరికి మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత తోమినా పోదు. వాతావరణ కాలుష్యం, ఎండ, పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో అక్క‌డ చర్మం నల్లగా మారుతుంది. ఈ స‌మ‌స్య చాలా వేధిస్తుంది. 

 

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ టిప్స్ ఫాలో అయితే మెడ మీద న‌లుపును మాయం చేయ‌వ‌చ్చు. అందులో ముందుగా.. కలబంద జెల్ ను తీసుకుని.. నేరుగా మీ మెడపై రుద్దండి. చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టండి. అనంత‌రం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు. అలాగే బియ్యంపిండిలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి. కాబ‌ట్టి, బియ్యంపిండిలో కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పావు గంట త‌ర్వాత‌ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

 

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం క‌న‌ప‌డుతుంది.  అదేవిధంగా, నిమ్మరసం పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి, పావుగంట తర్వాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈవిధంగా రోజూ చేస్తే మెడ నలుపు పోతుంది. మ‌రియు ఒక చిన్న బంగాళాదుంప తీసుకుని మెత్తగా రుబ్బి, రసం తియ్యాలి. ఈ రసాన్ని మీ మెడపై వేసి పూర్తిగా ఆరనివ్వండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉప‌యోగించాలి. బంగాళాదుంపలకు బ్లీచింగ్ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నల్ల మచ్చలను తొలగించడానికి మరియు మీ చర్మాన్ని టోన్ చేయడానికి గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: