అందంగా, ప్ర‌కాశవంతంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ, అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. పొడి చర్మం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా అనేక స‌మస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఫలితంగా, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతాము. అయితే ముఖచర్మం అందంగా మారాలంటే స్టీమింగ్(ఆవిరి ప‌ట్ట‌డం) ట్రై చేస్తే చాలంటూన్నారు బ్యూటీషియన్లు. మనం సాధారణంగా జలుబు చేసి ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతుంటే ఆవిరి పట్టుకోమంటరు.

 

కానీ, చ‌ర్మాన్ని మెరిపించ‌డానికి కూడా ఆవిరి ప‌ట్టించ‌వ‌చ్చు. ముఖానికి ఆవిరి పట్టే నీటిలో తులసి ఆకులతోపాటు చిటికెడు పసుపు కలిపి ఆవిరి పడితే మొటిమలు మటుమాయమవడమే కాకుండా చర్మానికి సహజసిద్ధమైన పోషకాలు లభించిముఖం కాంతివంతమవుతుంది. అలాగే రెండు గ్లాసుల నీటిని వేడి చేసి అందులో టీ బ్యాగులను ఉంచి ఆవిరి పట్టుకుంటే.. ముఖం తాజాగా మెరిసిపోతుంది. ఇదే సమయంలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగలడమే కాకుండా, సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి. అదే విధంగా, రెండు గ్లాసుల నీటిలో గులాబీ రేకులు వేసి మ‌రిగించాలి. అనంత‌రం ఆ వాట‌ర్‌తో ముఖానికి ఆవిరి ప‌ట్టించాలి. 

 

ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంలోని మతకణాలను తొలగిస్తుంది. చర్మ కణాలను తెరుచుకొనేలా చేసే తేమనందిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. మ‌రియు వయస్సును తెలపనియకుండా ఉపయోగపడుతుంది. నిత్య యవ్వనంగా కనబడేలా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది చర్మంలో చాలా మార్పులు చోటు చేసుకొంటాయి. అయితే అటువంటి సమయంలో ఈ పద్దతిని పాటించడం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక కేవ‌లం నీటిని బాగా మ‌రిగించి కూడా ఆవిరి ప‌ట్ట‌వ‌చ్చు. దీని వ‌ల్ల చర్మాన్ని బిగుతుగా ఉండేలా కాపాడుతుంది. ఇలా ఆవిరి పట్టడం వల్ల చర్మంలోపల ఇమిడి ఉన్న నూనె గ్రంధులను తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: