అంద‌రిలోనూ తాము అందంగా క‌నిపించాల‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఏవో చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌నల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే అందం రెట్టింపు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా తేనె మ‌రియు నిమ్మ‌తో అందాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. నిమ్మ రసంలో ఉన్నటువంటి కొన్ని సహజ లక్షణాల వల్ల‌ గత కొన్ని సంవత్సరాల నుండి చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స కోసం ఉప‌యోగిస్తున్నారు. 

IHG

అలాగే నిమ్మ‌ర‌సం బ్లీచింగ్ గా పని చేసి మీ చర్మం తెల్లబడటంలో సహాయపడుతుంది. ఇక చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు పుష్క‌లంగా ఉంది. తేనె మీ చర్మాన్ని సంరక్షించి మీ అందాన్ని పరిపరి విధములుగా ఇనుమడింపచేస్తుంది. అయితే ఈ రెండిటిని క‌లిపి ఉప‌యోగిస్తే.. అందాన్ని మ‌రింత రెట్టింపు చేసుకోవ‌చ్చు. 

IHG

ఎందుకంటే.. తేనె మరియు నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంలో మరియు చర్మాన్ని తేలికపరచడంలో సహాయపడుతుంది. రెండు చెంచాల నిమ్మరసం మరియు ఒక చెంచాడు తేనె తీసుకుని బాగా కలపండి. దీనిని ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించి.. అర‌గంట పాటు ఆర‌నివ్వండి. అనంత‌రం చ‌ల్ల‌టి నీటిలో శుభ్రం చేసుకోండి. 

IHG

ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల చర్మంపై మృతకణాలను తొలిగిస్తుంది. అలాగే నల్లని మచ్చలను, మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ ప్యాక్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు తేనె, నిమ్మరసం ఫ్యాక్ ముఖంపై ముడుతలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: