పాదాల ప‌గుళ్లు.. సాధార‌ణంగా ఈ కాలంలో చాలా మందిని ఈ‌ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో పాదాలు అందవిహీనంగా కనిపించడంతో పాటు, చర్మానికి గీసుకుపోతూ చికాకు పెడతాయి. అయితే పరిష్కార మార్గాల కోసం ఎంతో ఖర్చు పెట్టడం, పరిస్థితిలో మార్పు రాలేదని బాధపడటానికి ఇక స్వస్తి పలకండి. ఎందుకంటే.. కేవ‌లం ఇంట్లోనే లభ్యమయ్యే వస్తువులతోనే ఈ పగుళ్లకు చెక్‌ చెప్పేయొచ్చు. అందుకు ముందుగా.. యాంటీఫంగల్‌ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది. 

 

కాబ‌ట్టి, కొన్ని వేపాకులు మ‌రియు ఒక‌ స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనె అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే ప‌గుళ్ల స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే రాత్రి నిద్రించే ముందు పాదాలను మురికి లేకుండా బాగా కడిగి, తుడుచుకోవాలి. అనంత‌రం ఆముదంలో కొద్దిగా పసుపును వేసి పేస్ట్ అయ్యేలా బాగా కలిపి దీన్ని పాదాల పగుళ్లకు రాసుకుని పడుకోవాలి. ఉద‌యం లేవ‌గానే నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

అదేవిధంగా, పగుళ్లు ఉన్న చోట మెత్తగా రుబ్బిన గోరింటాకు పెట్టి, ఎండాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి. మ‌రియు ప‌దాలు మృదువుగా అయ్యేలా చేస్తాయి. అలాగే కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి.. ఒక అర గంట పాలు కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పాదాల‌ పగుళ్ల నుండి ఉపశమనం పొందొచ్చు. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: