చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే క్రిములు ఉపయోగించే బదులు ఏదైనా మంచి ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలా మనకు మంచి ఫలితాలు ఇచ్చే దానిలో కళింగర కాయి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ పండు లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కళింగిర కాయిని పుచ్చకాయ అని అంటారు. ఇంకా ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. అందుకే వేసవిలో పుచ్చకాయ తినటం ద్వారా ఎన్నో లాభాలు కలుగుతాయి. 

 

ఇంకా ఈ పుచ్చకాయ తినడం వల్ల చర్మం తాజాగా కనిపించటమే గాక ఎండ కారణంగా కోల్పోయిన సహజసిద్ధమైన నిగారింపు కూడా మీ సొంతం అవుతుంది. 

 

సూర్యరశ్మిలోని ప్రమాదకరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మనల్ని మనం కాపాడుకోవాలంటే పుచ్చ, దోసకాయ గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. దీని ద్వారా మన చర్మం సూర్యరశ్మి వల్ల కమిలి పోకుండా కూడా కాపాడుకోవచ్చు.

 

రోజూ పుచ్చకాయ ముక్కలు తిన్నా, దాని గుజ్జును ఒంటికి రాసుకున్నా అందులోని లైకోపిన్‌, సి, ఎ విటమిన్ల కారణంగా చర్మంపై ఏర్పడే గీతలు, ముడుతలు పోతాయి.

 

పుచ్చకాయ చర్మానికి సహజసిద్దమైన టోనర్‌గా ఉపయోగపడుతుంది. 

 

గుప్పెడు పుచ్చకాయ గుజ్జును అరచెంచా తేనెతో కలిపి చర్మానికి పట్టించి కడిగేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది. 

 

మొటిమలు తగ్గడానికి పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు ఉన్నవారు ముఖాన్ని శుభ్రంగా కడిగి పుచ్చకాయ రసం ముఖానికి పట్టిస్తే మంచి లాభాలు ఉంటాయి. 

 

పుచ్చకాయ గుజ్జు, పుదీనా ఆకులను ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్ లో ఉంచి ఆ ముక్కలతో రుద్దుకుంటే ఆరోగ్యం మీ సొంతం. 

 

పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా శెనగపిండి కలిపి ముఖానికి పట్టిస్తే ముఖ చర్మంలో దాగున్న మురికి, వ్యర్ధాలు తొలిగిపోయి అందంగా తయారవుతారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: