వ‌రిపిండి.. దీన్నే బియ్యంపిండి అని కూడా అంటారు. ముఖ్యంగా భార‌తీయులు వ‌రిపిండిని ఎక్కువ‌గా యూజ్ చేస్తుంటారు. ఈ పిండితో అనేక ర‌కాలు వంట‌లు చేస్తారు. అయితే వ‌రిపిండి కేవ‌లం వంట‌ల‌కే కాదు.. చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. మ‌రి బియ్యం పిండిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి..? అన్న‌ది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే చ‌క్క‌టి ఫ‌లితం పొందొచ్చు. ఇందులో ముందుగా.. వ‌రిపిండిలో కొద్దిగా పెరుగు మ‌రియు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

 

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా అప్లై చేసి.. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణాలు తొల‌గుతాయి. మ‌రియు మొటిమ‌ల స‌మ‌స్య కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. అలాగే వ‌రిపిండి, ఆలోవెరా జెల్‌, తేనె కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా అప్లై చేసి.. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోతాయి. మ‌రియు ముఖం మృదువుగా కూడా మారుతుంది.

 

అదేవిధంగా, వ‌రిపిండిలో కొద్ది పాలు పోసి బాగా మిక్స్ చేయాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా అప్లై చేసి.. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సూర్యరశ్మి నుండి వెలువడే యూవికిరణాల నుండి చర్మంను కాపాడుతుంది. మ‌రియు ముడ‌త‌లు లేకుండా చేస్తుంది. మ‌రియు వ‌రిపిండి, అర‌టిపండు పేస్ట్, కొద్దిగా ఆముదం బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా అప్లై చేసి.. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం నిమిషాల్లో కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ వారికి ఈ ప్యాక్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: