నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య హెయిర్ ఫాల్. సాధార‌నంగా చాలా మంది ఒత్తయిన, నల్లని నిగనిగలాడే జుట్టు కావాలనుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. కానీ, జుట్టు మాత్రం ఊడిపోతూనే ఉంటుంది. వాస్త‌వానికి కాలుష్యం, పోషకాహార లోపం,  వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాల వ‌ల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దీంతో ఏవేవో షాపులు, ఆయిల్స్ వాడేస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు ఖ‌ర్చుకు చేస్తారు. 

IHG

నిజానికి కురులు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి పార్లర్‌కి, సెలూన్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. అయితే జుట్టు రాల‌డాన్ని ఆప‌డంలో కొబ్బ‌రి పాలు గ్రేట్‌గా ప‌నిచేస్తాయి. మ‌రి కొబ్బ‌రి పాల‌ను శిరోజాల‌కు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి నుండి పాలను తీయండి. ఈ పాల‌ను మీ త‌ల‌కు మ‌రియు జుట్టుకు బాగా అప్లై చేసి మ‌సాజ్ చేయాలి. 

IHG

అర గంట త‌ర్వాత త‌ల‌స్పానం చేయాలి.  ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల‌ కేశాలకు పోషణ అందించి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి నుండి పాలను తీయండి. ఆ పాల‌లో కొద్దిగా నిమ్మరసంతో కలిపి త‌ల‌కు మ‌రియు జుట్టుకు బాగా ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేయాలి. అర గంట త‌ర్వాత త‌ల‌స్పానం చేయాలి.  ఇలా వారానికి ఒక‌సారి చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గ‌డ‌మే కుండా.. చుండ్రు స‌మ‌స్యను కూడా నివారిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: