సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రు ఎదుర్కొనే స‌మ‌స్య శ‌రీర దుర్వాస‌న‌. రెండు పూటలా స్నానం చేసినా, ఎంత శుభ్రంగా ఉన్నా.. శరీరం నుంచి కొంద‌రికి భ‌రించ‌లేని దుర్వాస‌న వ‌స్తుంటుంది. ఇలాంటి వారు ఇత‌రుల మ‌ధ్య తిర‌గాలంటే చాలా ఇబ్బంది ప‌డ‌తారు. ఎన్ని రకాల స‌‌బ్బులు, బాడీ లోషన్స్, ఫెర్ఫ్యూమ్స్ ఉపయోగించినా.. కొద్దిపేసటికే చెమ‌ట ప‌ట్టి దుర్వాస‌న రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.. శరీరం నుంచి వ‌చ్చే దుర్వాసన‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

అందులో ముందుగా టొమాటో రసాన్ని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని చేయాలి. ఆ టొమాటో రసాన్ని దుర్వాసన వచ్చే చోట్ల రాసుకున్నా కూడా సమస్య తీరిపోతుంది. ఎందుకంటే.. టొమాటో నేచురల్ యాంటీసెప్టిక్. ఇది బ్యాక్టీరియాని చక్కగా చంపేస్తుంది. ఇక తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారంలో కెఫైన్‌, మసాలా, ఆల్కహాల్‌, వంటివి లేకుండా చూసుకుంటే మంచిది. అలాగే శరీరం నుంచి వ‌చ్చే దుర్వాసన‌కు చెక్ పెట్టడంలో నిమ్మకాయ సూపర్బ్‌గా పని చేస్తుంది. 

 

నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, వాటితో అండర్ ఆర్మ్స్ లో రుద్దు చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్ర‌తి రోజూ చేస్తే అండర్ ఆర్మ్స్ లో ప‌ట్టే చెమ‌ట త‌గ్గి.. దుర్వాస‌న రాకుండా చేస్తుంది. అలాగే నిమ్మ ర‌సాన్ని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని చేయాలి.  ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా శరీరం నుంచి వ‌చ్చే దుర్వాసన త‌గ్గుతుంది. మ‌రియు రోజంతా ఫ్రెస్‌గా ఉంటుంది. ఇక ఆరెంజ్ ఫ్రూట్స్ లో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడంలో అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ద్వారా చెమట పట్టకుండా చేయ‌డ‌మే కాకుండా..  శరీరం నుంచి వ‌చ్చే దుర్వాసన‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: