గ్రీన్ టీ.. ఇటీవ‌ల కాలంలో చాలా మంది దీన్ని తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన టీల‌తో పోల్చితే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని ఇష్టంగా తాగి మంచి ఫ‌లితం పొందుతున్నారు. అలాగే రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క్యాన్సర్ను నివారించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, డిప్రెషన్, తలనొప్పి, అతిసారం, బలహీనమైన ఎముకలు, ఉదర సమస్యలు మొదలైన వాటిని పరిష్కరిస్తుంది.

 

అయితే గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు చ‌ర్మానికి కూడా గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. గ్రీన్ టీ చ‌ర్మానికి ఉప‌యోగించ‌డం వ‌ల్ల.. మెరిసే స్కిన్‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రి గ్రీన్ టీను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. ఒక టేబుల్ స్పూన్ అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీలో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.. ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మ‌రియు మృత క‌ణాలు కూడా తొలిగి.. ముఖం ప్ర‌కాశ‌వంతంగా మార‌తుంది.

 

అదేవిదంగా, ఒక టేబుల్ స్పూన్ అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీలో కొద్దిగా మీగడ, ఒక టీ స్పూన్ పంచదార పొడి మిక్స్ చేయ‌డం. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.. ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అలాగే గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మంను మెరిసేట్లు, క్లియర్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీలో శెనగపిండి, పెరుగు తో చేర్చి, చర్మానికి అప్లై చేసి స్క్ర‌బ్బింగ్ చేయాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: