నువ్వుల నుంచి తీసే నువ్వుల నూనెను భార‌తీయులు వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తారు. నువ్వుల నూనె వంట‌ల‌కు రుచిని ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలను కూడా చేకూర్చుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక నువ్వుల‌ నూనెను వంటలలోనే కాకుండా దేహమర్దన తైలంగా, ఆయుర్వేద మందులలో, కాస్మోటిక్స్‌ తయారీలో వాడుతారు. ముఖ్యంగా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరిపించ‌డంలో నువ్వుల నూనె అద్భుతంగా ప‌నిచేస్తుంది.

 

మ‌రి ఈ నూనెను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌తిరోజు రాత్రి నిద్రించే ముందు కొద్దిగా నువ్వుల నూనె ముఖానికి అప్లే చేసి ప‌డుకుంటే.. ఉద‌యానికి చర్మం మీది మలినాలు తొలగి ముఖం తాజాగా మారుతుంది. అలాగే నువ్వుల నూనెలో కొద్దిగా శెన‌పిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట పాటు అర‌నిచ్చి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల .. నువ్వుల నూనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. 

 

ఇవి మొటిమలు నివారించడంతో పాటు, కొత్తగా వచ్చే మొటిమలు రాకుండా నివారిస్తుంది. అలాగే నువ్వుల నూనెను, రోజ్ వాటర్‌ను సమాన మోతాదులో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. పావు గంట పాటు అర‌నిచ్చి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల మృదువుగా మార‌డంతో పాటు మంచి రంగు సంత‌రించుకుంటుంది. అదేవిధంగా, నువ్వుల నూనెలో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట త‌ర్వాత‌ చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేడ‌యం వ‌ల్ల టానింగ్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. మ‌రియు ముఖాన్ని ప్ర‌కాశ‌వంతంగా కూడా త‌యారు చేస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: