పంటి పై ఉండే గారలో బాక్టీరియా నివాసముండి, నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును.  మనం కొన్ని రకాల నోటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటాం. నోటికి సంబంధించిన ఎక్కువ శాతం సమస్యలన్నీ తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి, దీర్ఘకాలంలో సరిదిద్దలేని నష్టాన్ని ఙపకలిగించేవై ఉంటాయి. అయితే వీటి వల్ల కలిగే ఇబ్బందులు ఓర్చుకోగలిగే స్థాయిలోనే ఉండటంతో వైద్యులను కలవటానికి అంతగా ఆసక్తి చూపించం. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే చేతికందిన మాత్రలు వాడేసి అప్పటికి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ నొప్పికి అసలు కారణం గురించి, సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల కలిగే నష్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయం. కొందరు నోటి శుభ్రత పాటించరు.

దంతాలను బ్రష్‌తో సరిగా శుభ్రం చేసుకోరు. దాంతో నోట్లో చిగుళ్ల చుట్టూ పాచి పేరుకుంటుంది. ఫలితంగా చిగుళ్లు వాయటం, ఎరబ్రడటం, వాటి నుంచి రక్తం కారటం లాంటి సమస్యలు మొదలవుతాయి. చిగుళ్ల జబ్బును సూచించే ఈ లక్షణాలన్నీ దాదాపు అందరూ ఏదో ఓ సమయంలో ఎదుర్కొంటూనే ఉంటారు. కొన్ని సార్లు పిప్పి పళ్లతో విపరీతమైన బాధ కలుగుతుంది..దీనికోసం మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా  పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి నొప్పి దూరమవుతుంది.  


పంటి నొప్పితో ఎన్నో భాదలు


పంటి నొప్పి రాకుండా ఈ చిట్కాలు పాటించండి..!!

పంటి నొప్పి తగ్గించడానికి లవంగం నూనె మంచిది. లవంగ నూనెలో ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పన్ను మీద పెట్టాలి.

పంటి నొప్పినుండి ఉపశమనాన్ని పొందడానికి ఆవ నూనె కూడా వాడవచ్చు. ఒక్క చిటికెడు ఉప్పు కలిపిన ఆవ నూనెను సలుపుతున్న చిగుళ్ళపై మర్దన చెయ్యాలి.

నిమ్మరసం కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది.

లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.

మీరు లవంగాలను పంటి నొప్పి ఉన్న చోట పెట్టి సుమారు 4-6 గంటలు ఉంచితే తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.లవంగాలకు చిన్న ముళ్ళు ఉంటాయి కంగారుపడవద్దు. 

నొప్పిగా ఉన్న చిగుళ్ళ మీద మరియు పంటి మీద అప్పుడే తరిగిన ఉల్లి పాయ ముక్కను పెట్టుకోవడం ద్వారా పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారించవచ్చు.

నొప్పిని అదుపులో ఉంచడానికి బుగ్గ మీద ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు.

అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు, చల్లటి, వేడి మరియు తీపి పదార్ధాలు నొప్పిని అధికం చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చిరుతిళ్ళు తినరాదు.

మీ చిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: