సొసైటీలో అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది..ముఖ్యంగా ఆడవారు తమ ముఖవచ్చస్సు కోసం ఎన్నో బాధలు పడుతుంటారు. ఇక చాలా మంది తమ అందాలు మెరుగులు దిద్దుకోవడం కోసం బ్యూటీ పార్లర్ ని ఆశ్రయిస్తుంటారు.  నాసపండు ఆరోగ్యానికి ఎంతో సహయపడుతుంది. అంతేకాకుండా... పైనాపిల్‌లో అందచందాలను ఇనుమడింపచేసే పవర్ ఉందని బ్యూటీషన్లు అంటున్నారు.


అనాసపండు రసాన్ని మీ ఫేస్కి రాసుకుని మర్దన చేసుకుంటే మఖ చర్మం మృదువుగా మారుతుంది అంతే కాదు బిగుతుగా తయారవుతుంది.  అనాసపండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి.  చర్మంపై నల్లటి మచ్చలను కూడా నివారిస్తాయి. క్యారెట్ రసం, అనాసరసం సమపాళ్ళలో తీసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం ప్రకాశవంతమవుతుంది.


అనాస ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. బాదంపప్పుల పొడికి, ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ అనాస పండు రసం కలిపి తయారు చేసుకున్న ముద్దను ఫేస్ ప్యాక్‌గా పెట్టుకుని అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశాన్ని సంతరించుకుంటుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: