ఉసిరి కాయని చూస్తే నోరు ఊరంది ఎవరికి చెప్పండి... పకృతి మానవ జీవనానికి ఇచ్చిన అద్భుతవరం ఉసిరి ఇందులోని ఎన్నో సుగుణాలు వైద్యపరంగా మానవళి అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తున్నాయన్నది వాస్తవం.   కాసింత వగరుగా... మరికొంత పులుపుగా... మరికాస్త తీయ్యగా.... అనేక రుచులు కలగలపిన ఈ ఉసిరిని మనం వివిధ రకాలుగా తీసుకుంటాం. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉసిరికాల జ్యూస్ తాగితే ఎనలేని సౌందర్యం, ఆరోగ్యం మనసొంతమవుతుందన్న విషయం పకృతి వైద్యనిపుణులు తేల్చి చెప్పున్నారు. ఉసిరి మానవాళికి అందిస్తున్న అందం ఆరోగ్య సంబంధిత విషయాలని ఓసారి పరిశీలిస్తే అద్భుతం అనిపంచక మానదు. ముఖంపై మొటిమలు అధికంగా ఉన్న టేనేజ్ వారు క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ ని ఉదయాన్నే తాగితే మంచి ఫలితం వస్తుంది.  అలాగే శరీరం కూడా మంచి రంగుతేలి మెరుపు ధనాన్ని సంతరించుకుంటుంది. ఉసిరిక పొడిని రెండు చెంచాలు తీసుకుని వేడి నీటిలో బాగతా కలపండి నేరుగా దీనిని తాగలేని వారు మిరియాలు కాసిన్ని పొడిచేసి వేసి తాగవచ్చు. ఇంకా రుచి కావాలనుకుంటే.... కాసింత ఉప్పకానీ, తేనెను కాని కలిపి రుచి కోసం కాస్త మసాలా దినుసుల పొడి కలిపి తీస్కోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: