మార్కెట్ లో రోజుకో రకంగా సౌందర్య సాధనాలు వస్తూ ఉంటాయి. పేస్ వాష్ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు, క్లీనర్లు, టోనర్లు, ఫేస్ స్క్రబ్లు, ఫేస్ మాస్క్లు, ఇలా ఎన్నో రకాల రసాయనిక మేళవింపుతో చర్మాన్ని నాశనం చేసే ఎన్నో సాధనాలు దొరుకుతాయి. అలాగే బ్యూటీ పార్లర్ లలో ఎన్నో డబ్బులు వెచ్చించి మరీ మనం ఈ రసాయనిక పదార్ధాలని ముఖానికి పట్టించుకు వస్తాం అయితే. ఇంట్లోనే దొరికే పదార్ధాలతో మనం తయారు చేసుకునే సౌందర్య సాధనాలని వాడటం వలన చర్మానికి ఎటువంటి ప్రమాదం రాదు కదా చర్మం ఇంకా నిగారింపుతో మెరిసిపోతూ ఉంటుంది.

 Image result for tamarind face mask

చింతపండు తో ఫేస్ వాష్ తయారు చేసుకోవడం గురించి బహుశా ఎవరూ విని ఉండరు. ఇలాంటి పద్దతులు పూర్వపు రోజుల్లో వారికి తప్ప ప్రస్తుత కాలం వారికి అసలు తెలియనే తెలియవు. చింతపండులో ఉండే పోషకాలు శరీరాన్ని మృదువుగా చేయడంతో పాటు స్కిన్ టోన్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మాని మృదువుగా మెత్తగా చేయడంలో దీనికి సాటి ఏదీ లేదు. అయితే చింతపండు గుజ్జుని ఉపయోగించి పేస్ వాష్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం..

 Image result for how to make tamarind face mask

2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

• 1 విటమిన్ ఇ క్యాప్సూల్ లేదా 1/2 టేబుల్ స్పూన్ విటమిన్ ఇ పౌడర్

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్

ముందుగా ఓ గిన్నెలో చింతపండు గుజ్జు తీసుకోండి, దాంతో పాటు పెరుగు తీసుకుని రెండు పదార్ధాలని బాగా కలియ తిప్పాలి. ఇప్పుడు దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి, అందులోనే విటమిన్ ఇ  క్యాప్సూల్ వేసి దానిని బాగా కలిపిన తరువాత ఆ ద్రవాన్ని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం లో కలపండి. తరువాత, కొంత తేనెను కలపండి. అన్ని పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి జోడించేటప్పుడు, వాటన్నిటినీ సరిగ్గా కలుపుతున్నారో లేదో ధృవీకరణ చేసుకోండి.

 Related image

ఇక చివరికిగా ఈ మిశ్రమానికి  జోజోబా నూనెను జోడించి అన్నింటినీ బాగా కలియతిప్పండి. పూర్తిగా మిశ్రమం తయారయ్యింది కాబట్టి చేతులతో ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి  మీ వేలికొనను ఉపయోగించి ముఖాన్ని మెల్లగా మసాజ్ చేయండి. కొంత సేపటి తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి చేస్తూ ఉంటూ చర్మం మీరు అనుకున్న విధంగా మార్పు చెందటం ఖాయం.


 




మరింత సమాచారం తెలుసుకోండి: