వేసవి వచ్చిందంటే అందరికి గుర్తొచ్చేది తాటి ముంజులే. తాటి ముంజులు ప్రతీ ఒక్కరిని వేసవిలో ఊరిస్తూ ఉంటాయి. పట్టణ ప్రాంత ప్రజలకి ఇవి ఎడారిలో ఒయాసిస్సు లాంటివి. అందరూ మెచ్చే ఎంతో ఇష్టంగా తినే ఏకైక ఫలం తాటి ముంజులు. ఎన్నో విలువైన పోషకాలు కలిగిన ఈ తాటి ముంజులు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయి. వేసవిలో అలసటతో, డీ హైడ్రేషన్ తో , చర్మ సంభందిత వ్యాధులు మరియు గ్యాస్ ట్రబుల్ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.అలాంటి సమస్యలు వేసవిలో రాకుండా ఉండాలంటే తప్పకుండా ముజులు తినితీరాల్సిందే.

 Image result for ice apple

తాటి ముంజులకి మరొక పేరు కూడా ఉంది అదేంటంటే ఐస్ యాపిల్స్. ఎందుకంటే ఇవి చూడటానికి తెల్లగా ఐసు ముక్కల్లా ఉంటాయి కాబట్టి వీటిని ఐస్ యాపిల్స్ అంటారు. వీటిలో ముఖ్యంగా. విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం, సి.ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్‌, పొటాషియం, ధయామిన్‌, రిబో ప్లేవిస్‌, నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ తదితర పోషకాలు లభిస్తాయి.

 Image result for ice apple

శరీరంలో వేడిమిని తగ్గించి జీవ క్రియల్ని మెరుగు పరచడంలో ముంజులు కీలక పాత్ర పోషిస్తాయి. ముంజులు కేవలం తినడానికి మాత్రమే కాదు బాహ్య సౌందర్యం కోసం, వేసవిలో చర్మం పాడవకుండా ఉండేలా కూడా ఉపయోగపడుతాయి. కొన్ని ముంజులని తీసుకుని వాటిని మెత్తగా చేసి శరీరానికి పట్టించడం వలన చర్మం ఎంతో మృదువుగా మారడమే కాకుండా మెరుపు కూడా వస్తుంది. పల్లె ప్రాంతాలలో ఇదే విధానాన్ని వేసవి కాలంలో పాటిస్తారు. చిన్న పిల్లలకి ముంజుల గుజ్జుతో శరీరాన్ని శుభ్రం చేస్తే వడ దెబ్బ నుంచీ కూడా వారిని కాపాడుకోవచ్చు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: