ప్ర‌తి ఒక్క‌రిలోను త‌ల వెంట్రుక‌లు ఒక అంద‌మైన భాగం. వాటి కోసం చాలా మంది ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. స‌హ‌జంగా కొంత మందిలో క‌నిపించేది బ‌ట్ట‌త‌ల‌. వ‌య‌సు పెరిగో, జీన్ స‌మ‌స్య‌ల వ‌ల్లో, జ‌బ్బుల కార‌ణంగానో చాలా మందిని బ‌ట్ట త‌ల స‌మ‌స్య వేధిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికిన‌ట్లు అయింది. అదేంటంటే మ‌నుషుల మూలక‌ణాలు వాడి చిట్టెలుక‌కు సైంటిస్టులు ప్ర‌యోగం ద్వారా కొత్త వెంట్రుక‌లు మొలిపించారు. 


తొలుత చిట్టెలుక‌, మ‌నుషుల్లోని డెర్మ‌ల్ పాపిలా అనే క‌ణాల‌ను క‌లిపారు. దాన్ని చిట్టెలుక చ‌ర్మం లోప‌ల ప్ర‌వేశ‌పెట్టారు. గ‌తంలో ఇలాంటి టెక్నిక్‌ను కొంద‌రు ప‌రిశోధ‌కులు అవిష్క‌రించినా జుట్టు పెరుగుద‌ల‌ను కంట్రోల్ చేయ‌లేం.. కాని ఇప్పుడు సైంటిస్టులు క‌నిపెట్టిన టిక్నిక్‌తో అదుపు చేయొచ్చ‌ట‌. అంతేకాకుండా ఇది చాలా స‌హ‌జంగా క‌నిపిస్తుంది. ఆమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో గురువారం జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్‌ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ఐఎస్ఎస్సీఆర్‌) స‌ద‌స్సులో శాన్ ఫ‌ర్డ్ బ‌ర్న్‌హ‌మ్ ప్రీబీస్ మెడిక‌ల్ డిస్క‌వ‌రీ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు బ‌ట్ట‌త‌ల‌ను నిరోధించే కొత్త స్టెమ్ సెల్ ప‌ద్ధ‌తి గురించి వివ‌రించారు. 


` స్టెమ్ స‌న్ థెరాప‌టిక్స్‌` అనే కంపెనీ అతి త్వ‌ర‌లో ఈ కొత్త టెక్నిక్ అభివృద్ది చేసి, మ‌నుషులపై టెస్టు చేస్తుంద‌ని చెప్పారు. డెర్మ‌ల్ పాపిలా మ‌నుషుల చ‌ర్మంలో ఉంటుంది. జుట్టు ఎదుగుద‌ల‌, పొడ‌వు, మందం దీని గ్రోత్‌పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌కు తీసుకున్న డెర్మ‌ల్ పాపిలా క‌ణాల‌ను పిండంలోని మూల క‌ణాల నుంచి తీసుకున్నారు. ఈ ప‌ద్ధ‌తి అభివృద్ధి చెందితే భ‌విష్య‌త్తులో బ‌ట్ట‌త‌ల‌కు కూడా చెక్‌పెట్టే ఛాన్స్ ద‌గ్గ‌ర్లోనే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: