దానిమ్మ రుచికరమైన పండు మాత్రమె కాకుండా, ఆరోగ్యాన్ని చాలా విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు అందాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించుటకు దానిమ్మను వాడమని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.  గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటకు వాడి సఫలం చెందారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వలన సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- దానిమ్మ, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పండు యొక్క బాహ్య పొర, చర్మంలోని ఎపిడేర్మల్'లో (శరీరంపై ఉన్న బాహ్య చర్మం) రక్త ప్రసరణను అధికం చేసి, ప్రమాదానికి గురైన కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.


- చిన్న పరమాణు నిర్మాణం కలిగిన దానిమ్మ పండు, సులభంగా చర్మంలోకి ప్రవేశించబడుతుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉన్న ''ప్యూనిక్ ఆసిడ్'' మరియు ''ఒమేగా-3 ఫాటీ ఆసిడ్''లు హైడ్రేట్ మరియు తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది.


- దానిమ్మ పండు పొడి చర్మానికి ఉపయోగపడిన విధంగానే, జిడ్డు చర్మానికి లేదా ఎక్కువ ఆయిల్ కలిగిన చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్ళను, మచ్చలు మరియు దురదలను శక్తివంతంగా తగ్గించి వేస్తుంది.


- సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్'ల వలన చర్మంపై కలిగే నష్టాలను మరియు చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా దానిమ్మ తగ్గించి వేస్తుంది.


- 'ఎల్లాజిక్ ఆసిడ్' మరియు 'పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్'లు దానిమ్మ పండులో ఉంటాయి, ఇవి చర్మంలో ఏర్పడే, క్యాన్సర్ ట్యూమర్ ఏర్పాటును అడ్డుకుంటాయి.


- దానిమ్మ పండులో పుష్కంలంగా 'పాలీఫినాల్' మరియు యాంటీ- ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగినందు వలన, ఇవి చర్మం పై ఏర్పడిన మంటలను మరియు వాపులను శక్తివంతంగా తగ్గిస్తాయి. 


- చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న తెగుళ్ళను, మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


- అకాల వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాలలో ఇది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ముఖంపై ముడతలను మరియు గీతాలను దానిమ్మ పండు తగ్గించి వేస్తుంది. 'హైపెర్పిగ్మెంటేషన్' మరియు వయసు మీరిన కొలది కలిగే మచ్చలను ఈ పండు తినటం ద్వారా తగ్గించుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: