మహిళలకు 30 ఏళ్ళు వచ్చాయంటే చాలు ఎంతో అందంగా యవ్వనంగా ఉండే వారి మొఖం కూడా ముడుతలతో అసహ్యంగా తయారవుతుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు అందంగా ఉండటానికి ప్రయత్నించినా సరే ఆ ముడతలు తగ్గవు. ఒకవేళా ఆ ముడతలు తగ్గు ముఖం పట్టిన సరే ముఖంలో ఏ మాత్రం కాంతి ఉండదు. 


ముఖంలో ముడుతలు పోయి కాంతివంతంగా తయారయిన సరే మొటిమలు పోకుండా అందంపై చిరాకు వచ్చేల చేస్తాయి. అయితే 30 దాటాక అందంగా ఉండాలంటే ఇక్కడ ఉన్న చిట్కాలు పాటించండి అందంగా తయారవ్వండి. 


ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడేవారు బొప్పాయి పండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు, నల్ల మచ్చలు క్రమమంగా తొలగి పోతాయి.


పచ్చి శనగపప్పు రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీ లో వేసి పేస్ట్ లా తాయారు చేసి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత మంచి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.


ముఖ చర్మం కాంతితో మెరవాలంటే తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.


మొటిమల బాధితులు తాజా పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని తర్వాత చన్నీటితో కడిగితే ఎలాంటి మొటిమలైనా సరే మాటు మాయమవుతాయి. 


అలాగే ఈ మొటిమలకు పండిన టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా రసం రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం కావాల్సిందే. చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యాంగాను, అందంగానూ తాయారు చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: