సాధాన‌ఫంగా చాలా మంది త‌ల‌కు నూనె పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఒక‌ వేల పెట్టినా.. మ‌రుస‌టి రోజు త‌ల‌స్నానం చేసేస్తారు. కొంద‌రికి వేగవంతమైన ఉరుకులు పరుగుల వాతావరణం వల్ల తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండటం లేదు. తలకు నూనె రాసుకోవడం మన జీవనశైలిలో ఒక భాగం. కొందరికి రోజూ.. మరికొందరికి వారానికోసారి నూనె రాసుకోవడం అలవాటు. వారానికి కనీసం ఒక్కసారైనా నూనె పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ పై ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.


అలాగే వేడిని తగ్గిస్తుంది. జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తూ.. రాలకుండా కాపాడుతుంది. నూనెలలో ప్రముఖంగా కాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి, జుట్టులో ప్రోటీన్ నిల్వలను పొందడంలో సహాయపడుతాయి. జుట్టులో ప్రోటీన్ నిల్వలు పెరగడం, ఆరోగ్యకర జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. మార్కెట్లో లభించే అనేక రకాల నూనెలు, రసాయనాలను కలిగి ఉంటాయి. 


అయితే మీరు ఎంపిక చేసుకునే నూనెలు అధిక రసాయనాలు లేకుండా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. సైంటిఫిక్ గా రుజువు కానప్పటికీ తలకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనె రాయడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు నల్లపడకుండా నిరోధించవచ్చు.  నూనె రాయడం వల్ల, అది వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి కాలుష్య కారకాల వల్ల జుట్టు పాడవకుండా కాపాడుతుంది. సో.. ప్ర‌తి రోజు కాక‌పోయినా.. రెండు రోజుల‌కు ఒక సారైనా త‌ల‌కు నూనె రాసుకోవ‌డం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: