ఫేస్ ప్యాక్ అనగానే గుర్తొచ్చేది బ్యూటీ పార్లర్, టీవీలలో ముఖంపై క్రీములు రాసుకుంటూ  చూపించే యాడ్స్. ఇలా ఆడవారికి ఇట్టే ఆకట్టుకోవడానికి  వాళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే మనం బయట వాడుతున్న ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ లో రసాయనాలు ఎన్నో కలుస్తాయి.దాంతో ముఖం తేజస్సుని కోల్పోతుంది. అంతేకాదు ముఖంపై మచ్చలు కూడా ఏర్పడి ముఖం అందవిహీనంగా మారుతుంది.

 

కానీ పూర్వ ఇలాంటి క్రీములు లేవు, ఫేస్ ప్యాక్స్ లేవు. ఉన్నదల్లా ప్రక్రుతి ఇచ్చే సౌందర్య సాధనాలే. వంటింట్లో మనకి దొరికే చిన్నపాటి పదార్ధాల ద్వారా ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకుని మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మరి సహజసిద్ధంగా, అద్భుతమైన ఫలితాలని ఇచ్చే ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

 

పూర్వం అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, ముఖం , చేతులు,పాదాలు నునుపుగా మారడానికి సున్ను పిండి వాడేవారు.ఇది తిరుగులేని ఫేస్ ప్యాక్ గా ఇప్పటికీ మెరుగైన ఫలితాలని ఇస్తోంది. అయితే ఇది తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడి, సోదించి సాధించాల్సింది ఏమి లేదు. పెసలు , ఉలవలు తీసుకుని వాటిని ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసుకుని, అందులో కొంచం పసుపు వేసి , పాల మీగడ లేదా పెరుగు మీగడ గానీ కలిపి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఆ తరువాత దాన్ని ముఖానికి బాగా పట్టించి ఒక గంట పాటు ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అప్పటికే మీ ముఖ చర్మంపై మార్పుని గమించవచ్చు. ఇలా నెల రోజుల పాటు వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: