అందంగా, ప్ర‌కాశవంతంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఇందు కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల చుట్టూ తిరుగుతుంటారు. వేల‌కువేలు ఖ‌ర్చు చేసి ఏవేవో బ్యూటీ ప్రోడెక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక నిరాశ చెందుతుంటారు. అయితే వాస్త‌వానికి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఔషధాలు మ‌న వంటింటిలోనే ఉన్నాయి. మ‌రి అవేంటి..? వాటిని ఎలా ఉప‌యోగించాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఒక స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నువ్వుల నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి.

 

అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ప్ర‌తి రోజు ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. అందాన్ని పెంచుకోవడంలో బేకింగ్ సోడా ఒకటి. మీ పళ్ళు తెల్లగా మిళమిళ మెరవాలన్నా.. గారపళ్ళు తెల్లబడాలన్నా ఈ బేకింగ్ సోడాను చిటికెడు పళ్ళు రుద్దే బ్రెష్ మీద చిలకరించుకొని రుద్దితే మంచి ఫలితాన్ని మీరు చూడవచ్చు. అలాగే మెంతులను పొడి చేసి ముఖానికి లేదా జుట్టుకి పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా కూడా ఉంటుంది. అదేవిధంగా, మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని పేస్ట్ చేసుకుని తలకు పట్టించాలి. 

 

ఆరిన త‌ర్వాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చండ్రు, జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే బౌల్‌లో ఒక‌ స్పూన్ ఎరుపు కందుల పౌడర్ తీసుకుని దానికి కొద్దిగా పెరుగు, కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు వదిలివేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో క్లీన్ చేసుకుంటే.. ముఖంపై పేరుకున్న మ‌లినాలు తొల‌గి ప్ర‌కాశవంతంగా ఉంటుంది. మ‌రియు నిమ్మ రసం, పాలు కలిపి రాత్రి పూట ముఖానికి అప్లై చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు, వాటి వ‌ల్ల వ‌చ్చే మచ్చలు త‌గ్గుతాయి.
   
 

మరింత సమాచారం తెలుసుకోండి: