చలికాలంలో ఒళ్లంతా తెల్లబారి పగుళ్లు వస్తాయి. పొడిబారిన చర్మానికి మరీ మంటగా ఉంటుంది. అలాంటప్పుడు అలోవెరా గుడ్ మెడిసిన్ గా పనిచేస్తుంది. అలోవెరాతో కొన్ని బ్యూటి టిప్స్ చూద్దామా ... - అలో ఆలివ్ ఆయిల్, బాదం పేస్ట్ కలిపి ముఖానికి ఆప్లై చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ముఖం పొడిబారకుండా ఉంటుంది. - ఒక స్పూన్ గ్లిసరిన్, రెండు చుక్కల నిమ్మనూనె, ఒక స్పూన్ అరోమా జోజోవా ఆయిల్‌లో అలో జెల్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసిన తర్వాత ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. - ఒక స్పూన్ అలో జెల్, ఒక స్పూన్ గంధం పొడి, అరచెంచా బొప్పాయి పొడి, రెండు చెంచాలు గులాబీరేకుల పొడిని లావెండర్ ఆయిల్‌తో కలపాలి. దీన్ని ఒంటికంతా పట్టించవచ్చు. దీనివల్ల చర్మం పగలకుండా ఉంటుంది. - బంగాళాదుంప రసం, నిమ్మరసం, అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాయాలి. 20నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి బ్లీచ్‌గా పనిచేస్తుంది. మొటిమల మచ్చలనూ తగ్గిస్తుంది. - బాదం ఆయిల్, మంజిస్తా పౌడర్, బొప్పాయిపొడిలో అలోవెరా జెల్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నిగారిస్తుంది. - మొటిమల నివారణకు... అలోవెరా, వేపపౌడర్, గంధంపొడి కలిపి రాత్రి పూట రాయాలి. 20నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమల మచ్చలు తగ్గుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: