డైటింగ్ చేయటంవల్ల డైటింగ్ చేసేవారి శరీరంలో మేలుచేసే కొలెస్ట్రాల్, గుండెను రక్షించే ప్రోటీనులు తగ్గిపోతాయి. డైటింగ్ చేసేవారిలో గుండెనొప్పి ఎక్కువగా వస్తుంది. అందువల్ల డైటింగ్ చేయడం అనవసరం. హాయిగా అన్ని ఆహారపధార్థాలు తిని వ్యాయామం చేయటం మంచిదని వైద్యులు అంటున్నారు.  పనులు తమ చేతిమీదగా చేసుకునే స్త్రీలు ఎటువంటి డైటింగ్ అవసరం లేదు.  అనారోగ్యం కూడా దరిచేరదు. కాలరీలను తగ్గించి ఆహారం తీసుకోవడం వల్ల అంతా ఇబ్బందే. కనుక డైటింగ్ మానేయాలి. డైటింగ్ పేరుతో వేపుళ్లను వెంటనే మానేస్తారు.


అలా ఒకేసారి మానేయకుండా బాగా నూనె పీల్చే పధార్థాలను దూరంగా ఉంచిండి, కొవ్వుతోవుండే ఆహారపధార్థాలు తినడం మానేయండి.  స్నాక్స్ సమయంలో.. పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని వంటివి తీసుకోవచ్చు.


 సరైన ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే డైటింగ్. డైటింగ్ చేస్తున్నవారు ఏఏ సమయాల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని తెలుసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఉదయం పూట అల్పాహారంగా పాలు ఒక గ్లాసుడు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ తీసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: