ఈ మద్య అందం కోసం ఆడవారు రక రకాల టిప్స్ ఫాలో అవుతున్నారు.  అయితే కొంత మందికి ఇవి ఖరీదుతో కూడుకున్న విషయం కనుక ఇంట్లోనే కొన్ని ఔషదాలు, మూలికలతో ప్రకృతి వైద్యంతో  అందాలకు మెరుగు పెడుతున్నారు. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి.


అందువలన అవసరమైనన్నీ పాలే తాగాలి. పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటి పళ్ళలో విటమిన్ బి కాంప్లక్స్ వుంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ మిటమిన్ కాపాడుతుంది. చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచటంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోచా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి.


రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు మొహం కడిగేవారు ప్రతీసారి సోపువాడకుండా కేవలం నీళ్ళతో మాత్రం కడుక్కోవాలి. రిలాక్స్‌గా ఉండటం కొద్ది వరకు చర్మానికి మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: