బట్టతల. ఒకప్పుడు నాలుగు పదుల వయసు దాటిన వారు దీని బారిన పడేవారు. ప్రస్తుత ఫుడ్ కల్చర్, పెరిగిపోతున్న పొల్యుషన్ తో యువకులు కూడా దీని బారిన పడుతున్నాడు. 20ఏళ్లకే 40ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు. పైగా జుట్టు లేని మగవాడిని పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు ఆసక్తి చూపరు. దీంతో.. బట్టతల బారిన పడిన పెళ్లికాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు ఈ సమాజంలో.