ఇంట్లో ఉన్నప్పుడు ముఖానికి అందం కోసం ఏవేవో చేస్తుంటాం. కాస్త భిన్నంగా చర్మాన్ని మెరిపించే స్పా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసే స్పాతో తక్కువ బడ్జెట్ లోనే అందంగా మారిపోవచ్చు. ఒకసారి మీరూ ట్రై చేసి చూడండి. స్పా చికిత్స చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఐదారు చిన్న టవల్స్ ను అందుబాటులో ఉంచుకోండి. ఏదైనా ముఖానికి మేకోవర్ చేసినప్పుడు దాన్ని నీళ్లతో కడిగే బదులు గోరువెచ్చని నీటిలో ఆ టవల్స్ ముంచి.. ముఖంపై వేసి అద్దుకున్నట్టు తుడవాలి.