1. బట్టలు వాష్ చేసే సోప్స్ డిటర్జంట్ ల కారణంగా చేతులకి బాధ కలిగే అవకాశం ఉంది. హాని కలగకుండా ఉండాలంటే చేతులకి రక్షణగా గ్లౌసెస్ వాడుకోవడం మంచిది . గ్లిజరిన్, ఆలివ్ నూనె లేక నిమ్మరసం కలిపి చేతులకి రాసుకుంటూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. 2. మీ ఇంట్లో పాత్రలు తోమే సమయంలో గోల్డ్ రింగ్ వ్రేలిన ఉంచుకోరాదు. ఉంచిన అది అరుగుతుంది. అంతేకాకుండా అందహీనంగా కూడా మారుతాయి. గోల్డ్ బ్యాంగిల్స్ మణికట్టు సమీపంలో గుడ్డ కట్టుకోవడం వలన అరగుదలనుంచి కాపాడగలం. అంతేకాక మెరుపు ను కాపాడగలిగిన మీ చేతిన అందము పెరగుతుంది. మోచేతుల వద్ద నలుపుగాని ఉంటే నిమ్మ చెక్క రుద్దిన నలుపు పోతుంది. 3. రాత్రి పడుకోబోయే ముందు వాజలేరైన్ కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమం చేతులకి మర్దనా చేసిన తెల్లవారేసరికి మీ చేతులు మృదువుగా మల్లెపూవులవలె మెత్తగా ఉండగలవు. ఎక్కువ వేడి ఉన్నవి కానీ, అతి శీతల పదార్దములు కానీ చేతులతో తాకటం మంచిది కాదు. 4. బట్టలు ఉతకటం పూర్తియ్యాక వెంటనే చేతులకి వెనిగర్ గానీ, నిమ్మరసం గానీ కలిపి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఎవైన మరకలు అంటినా పోతాయి. రోమాలు పెరిగే దిశలో కోల్డ్ వాక్స్ రాసి మందపాటి గుడ్డతో రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో గట్టిగా రుద్దిన వెంట్రుకలు ఉడివస్తాయి. తర్వాత కోల్డ్ క్రీం తో మాలిష్ చేసుకోవడం మంచిది. మీ చేతులను 5 నిముషాలు గోరువెచ్చని నీటిలో ఉంచిన మృదువుగా, నాజూకుగా ఉంటాయి. కొద్దిగా నిమ్మరసం కొంచెం పంచదార కలిపి చేతులకి పట్టించి మర్దనా చేసుకుంటే చేతులకుండే బిరుసుతనం పోతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: