ఎత్తుమడిమల చెప్పులు :  నడకలో హుందాతనంకోసం ఆధునిక స్త్రీలలో ఎక్కువ మంది ఎత్తుమడిమలున్న చెప్పులనే వాడుతున్నారు. వీటి వల్ల వారి శరీర భంగిమలో లోపాలు ఏర్పడటమే కాదు, ఎత్తుమడిమల చెప్పుల వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎత్తు 1.5 అంగుళాలకు మించకుండా ఉండే చెప్పులు ఎంపిక చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ :   అవసరమైనవి కాకపోయినా చాలా వస్తువులను హ్యాండ్‌బ్యాగ్‌లో అలా మోసుకుని తిరుగుతుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరమనే అనాలి. ఎందుకంటే శరీర భంగిమ మారటమే కాకుండా, మెడ నొప్పి, వీపునొప్పి రావడానికి ఆస్కారమెక్కువవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బ్యాగ్‌లో ఉన్న అవసరం లేని వస్తువులను తీసేయడం మంచిది. మేకప్ తీసేయకుండా... మేకప్ వేసుకోవడంలో చూపిన శ్రద్ధ దాన్ని తీసేయడంలో చూపరు చాలామంది. మేకప్:   ఇంటికి రాగానే మేకప్ తీయకుండానే అలా వాలిపోతారు. ఇలా మేకప్ వేసుకుని తిరిగి తీసేయకుండా పడుకోవడం వల్ల ముఖం మీది చర్మం త్వరగా వయసు మళ్లుతుంది. అందువల్ల ఉన్న దానికంటే ఎక్కువ వయసు వారిగా కనిపించే ప్రమాదం ఉంది. కంటి మేకప్ తీసేయక పోవడం వల్ల కళ్లలో ఇన్‌ఫెక్షన్, కళ్లు ఎర్రబారటం, మంటలు, దురదలు వచ్చే అవకాశం ఉంది. మేకప్ వేసుకునేందుకు చూపే ఆసక్తి దాన్ని తొలంగించుకోవడంలో కూడా తప్పకుండా చూపాలి.  సైజు :   స్త్రీలలో 70 శాతం మంది తమ సైజుకు సరిపడని లో దుస్తులను వాడుతున్నట్టు ఒక అంచనా. ముఖ్యంగా బ్రాసైజు సరిగా లేనట్టయితే ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. వీపు, మెడ, ఛాతీ నొప్పి తోపాటు శరీర భంగిమలో తేడాలు ఏర్పడటం, రక్త ప్రసరణలో సమస్యలు ఏర్పడటం, శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలగడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి బ్రా సైజు అంచనా వేయడం కాకుండా కచ్చితమైన కొలతతో కొనాలి.  రూపురేఖ :  రూపురేఖల గురించి చింత 90 శాతం స్త్రీలు తమ రూపు రేఖల్లో కనీసం ఒక్కదాన్నైనా మార్చుకోవాలని అనుకుంటారని ఒక పరిశోధన సారాంశం. ఇటువంటి శారీరక అభవూదత వారిలో మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. అంతేకాదు, ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉండే స్త్రీలు తమ ఆహార విహారాల పట్ల తీసుకునే తీసుకునే అతి జాగ్రత్తలు వారి శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ముందుగా మనం ఉన్న పరిస్థితిని అలాగే అంగీకరించడం, మార్చలేని వాటి గురించి ఆలోచించడం మానెయ్యడమే మంచిది. తిండికి, మూడ్‌కి లంకె : పురుషులు సంతోషకరమైన సందర్భాలలో ఎక్కువగా తింటుంటారట, ఇందుకు విరుద్ధంగా స్త్రీలు ఒత్తిడిలో ఉన్నపుడు, బాధలో ఉన్నపుడు ఎక్కువగా తింటుంటారట. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. అంతేకాదు ఇలా ఒత్తిడిలో ఉన్నపుడు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నే ఇష్టపడుతారని కూడా అంటున్నారు. కాబట్టి స్థాయీభావాలను అదుపులో ఉంచుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. నిద్ర:   ముఖ్యంగా నిద్ర విషయంలో స్త్రీ పురుషులిద్దరు సమానంగానే నిద్రకు ప్రాధాన్యాన్ని ఇస్తారు. కానీ నిద్రలేమి స్త్రీల ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి వల్ల మూడ్ సరిగా లేకపోవడం, బీపీ లెవెల్స్‌లో తేడా రావడం స్త్రీలలోనే ఎక్కువ. కాబట్టి తగినంత నిద్ర తప్పనిసరి. వంటివి స్త్రీల ఆరోగ్యం మీద చాలా దుష్ర్పభావాన్ని చూపుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరి తర్వాత అని కాకుండా, కుటుంబ సభ్యులతో పాటు అని ఆలోచించడం ఆరోగ్యదాయకం.  

మరింత సమాచారం తెలుసుకోండి: