చాలామంది మహిళలు ఎంత తిన్నా ఏమాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. డైలీ ఫ్యాట్ ఫుడ్ తీసుకొన్న ఏమాత్రం లావెక్కరు. అయితే మరి కొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. ఇలాంటి వారినే ఊబకాయులు అంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం మీదే బరువు పెరగడం, తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలామంది మరిచిపోతుంటాం. బరువు తగ్గాలనుకునేవారు ఈ కింది సూచనలను గుర్తు పెట్టుకోవాలి. ఆకలి: ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. అలా అనిపించిన వెంటనే తినేయాలి. ఏ మాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, అరగంట తర్వాతో ఆహారం తినడంవల్ల ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం: ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలనుకునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నాం, రాత్రి భోజనంలో బియ్యంతో వండిన అన్నంకు బదులు రాగులు, గోధుమలు, సజ్జలూ ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి నాలుగు గంటలు ముందే భోజనం ముగించడం ఉత్తమమైన పద్దతి. వ్యాయామం: వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడికి, ఆందోళన : బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పై రెండిటి కారణంగా అధికంగా తినేయడంతో బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది. చక్కెరకు దూరంగా: బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. నిద్రలేమి: కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: