వేసవిలో చర్మం పొడిగా మారి చిరాకు పెడుతుంది. అందుకని ఎప్పుడూ తేమగా ఉంచుకోవటంానికి మంచినీరు తాగాలి. ఎండ తీవ్రంగా ఉన్న వేళల్లో (ఉదయం) 10 నుంచి సాయంత్రం 4 మధ్య బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. సూర్యకిరణాల్లో ఉండే రేడియేషన్ దుష్ర్ర్పభావాల నుంచి శరీరాన్ని రక్షించుకునేందుకు స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్-(ఎన్పీఎఫ్) 15 ఉన్న సన్ స్క్రీన్ లోషన్లు వాడుకోవచ్చు. వీటిని బయటకు వెళ్లటానికి అరగంట ముందే రాస్కోవటం మంచిది. రాసుకున్న తర్వాత 4 గంటలు మాత్రమే పని చేస్తాయి. తరువాత మళ్లీ రాస్కోవాలి. చెమట ఎక్కువగా పట్టే తత్త్వం ఉండేవారు సాయంత్రం వేళల్లోనూ స్నానం చెయ్యటం మంచిది. పడుకోవటానికి ముందుగా స్నానం చేస్తే మరీ మంచిది. దీనివల్ల మీ శీరరం తాజాగా ఉండటమే కాకుండా, కంటి నిండా నిద్రపడుతుంది. చూసి తినండి ! వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నాం భోజనంలో మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దు. పెరుగన్నం చాలామేలు చేస్తుంది. పచ్చి కూరగాయ ముక్కలు ఎక్కువగా తినాలి. దీనివల్ల వేసవి వేడిమికి సోలిపోకుండా, ఎప్పుడూ మరింత తాజాగా ఉండగలుగుతారు. కీరదోసకాయ బాగా తినోచ్చు. ఈసీజన్ లో ఎక్కువగా లభించే కర్భూజ, తర్భూజ వంటి పళ్లనూ, నిమ్మరసం మరింత ఎక్కువగా తీసుకోవాలి. రోడ్ల పక్కన బండ్లు, దుకాణాల్లో ముక్కలుగా కోసి అమ్మే పండ్లుగానీ, పండ్లురసాలు సోడాలుగానీ తాగకపోవటమే మంచిది. విటమిన్ సి, ఇ లు అధికంగా ఉండే ఆహారం పధార్థాల్ని తినటం శ్రేయస్కరం. దీనివల్ల చర్మం ఎండతాకిడిని మరింత సమర్థంగా తట్టుకోగలుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: