వేసవిలో శరీరంపైనే కాదు తలలోనూ చెమట ఎక్కువగగా పడుతుంది. దానికి తోడు మనం నూనె కూడా రాశామంటే ఇక చెప్పనక్కర్లేదు. తలంతా జిడ్డుకారుతూ కన్పిస్తుంది. దాని ప్రభావం ముఖం మీదా పడి కళాకాంతీలేనట్లు కన్పిస్తారు. ఫలితం ఆ రోజంతా మూడ్ విసుగ్గా ఉంటుంది.
  • సాధ్యమైనంత వరకు వేసవిలో తలకి నూనె పెట్టుకోకపోవటమే మంచిది. పెట్టినా రాత్రిపూట పెట్టుకుని పొద్దున్నే తలస్నానం చేసేయాలి. వేడినీరు, చల్లటినీరు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తల పూర్తిగా ఆరాక జడవేసుకోవాలి. వేడినీటితో స్నానం చేస్తే వెంటనే మళ్లీ తలలో చెమట మొదలవుతుంది. ఈ తడి కలిసి వెంట్రుకలను నిర్జీవంగా కన్పించేలా చేస్తాయి.
  •  వేసవిలో వెంట్రుకలను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి.
  •   చాలామంది మెడమీద చిరాకనింపించి ముడి పెట్టేస్తుంటారు. అలా ఎక్కువసేపు ఉంచినా గాలి వెళ్లక చెమట ఎక్కువవుంతుంది. అందుకని అప్పుడప్పుడు విరబోసుకుని ఉండడమూ అవసరమే.
  • రెండు, మూడు రోజులకోసారి తప్పనిసరిగా తలస్నానం చేయాలి.
  • శిరోజాలు పూర్తిగా పొడిబారకుండా నిపుణులు సలహా మేరకు కండిషనర్ వాడుతూ ఉంటే వేసవిలోనూ కేశసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
  • మరింత సమాచారం తెలుసుకోండి: