వేసవికాలం వచ్చిందంటే చర్మం పట్ల మరింత శ్రద్ద వహించాల్సిన అవసరం వుంది. చెమట సామర్థ్యం ఎక్కువగా ఉండటం వలన చెమట పొక్కులు రావడం, చర్మం కందిపోవడం లేదా చర్మం నల్లబడటం వంటివి వస్తుంటాయి. ఇవన్నీ శరీరం ఎండలో ఎక్స్ ఫోజ్ అవడం వలన ఈ సమస్యలు వస్తాయి. ఈ కాలంలో నూనె వస్తువులు ఎక్కువగా తినకూడదు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. దాహం వలన ఎక్కువ మంచినీళ్లు తాగేస్తూ ఉంటాం. అందుకే అన్నం తినాలని అనిపించదు. అలా అని అన్నం తినడం మానకూడదు. పండ్లు, పండ్లరసాలు, సలాడ్లు, సూప్స్ తీసుకోవాలి. రోజుకు పది పన్నెండు గ్లాసులు మంచినీళ్లు తాగుతూ వుండాలి. మంచి సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ కొనుక్కునే ముందు అందులో జింక్ ఆక్సైడ్ ఉన్నది లేనిదీ పరిశీలించాలి. జర్మనీకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా క్యాప్ పెట్టుకుని వెళ్లాలి. లేదా మీ గొడుగు తీసుకుని వెళ్లాలి. మీరు బయటకు ఎండలో వెళ్లేటప్పుడు చల్లని నీటిని తాగి వెళ్లండి. ఎండలో నుండి వచ్చిన తరువాత కొంతసేపు ఆగి తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వలన శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవచ్చు. చర్మ సమస్యలు మొదలయ్యే వరకు మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఎప్పుడైతే మొటిమలు, మచ్చలు మొదలు అవుతాయో, చిన్నతనంలోనే చర్మం సాగిపోవడం. ముడుతలు పడటం వంటివి జరుగుతుందో అప్పుడు ఖంగారు మొదలవుంది. గంటకు పదిసార్లు అద్దంలో చూసుకుని ఆందోళన చెందుతారు. ఏదైనా సమస్య మొదలయ్యాక ఆదుర్థా చెందే కంటే ముందు నుంచి జాగ్రత్త పడటం మంచిది, రెగ్యులర్ గా చర్మం సంరంక్షణను పాటించండి. రాత్రి వేళ ఎంతగా అలసిపోయినా మేకప్ తుడిచియ్యకుండా, మాయిశ్చరైజర్ రాసుకోకుండా నిద్రపోవద్దు. వాతావరణం చల్లగా ఉండటం వలన పండ్లు, పండ్ల రసాల మీదకు మనసుపోదు. ఎంతసేపు వేడి వేడి బజ్జీలు, ఛాట్ వంటివి తినాలి అన్పిస్తుంది. కూరలు కూడా వండించుకుని తనడం కన్నా ఫ్రై చేసుకుని తింటే బావుంటుంది అని అనిపిస్తుంది. దీని వలన మన శరీరరానికి కావాల్సిన పోషక పధార్తాలు అందవు. కాబట్టి పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పండ్లు, కూరగాయలు బాగా తినాలి. ఎప్పుడో ఒకసారి ఛాట్ వంటివి తినడంలో తప్పు లేదు. ‘బి’ ‘సి% విటమిన్లు ఫోలిక్ యాసిడ్ లోపం వలన అలసట, వ్యాకులత ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆయా పోషక పధార్థాలు లభించే ఆహారం తీసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: