వాతావరణ కాలుష్యం.. విటమిన్ల లోపం.. మానసిక రుగ్మతల వల్ల కేశాలు విపరీతంగా రాలిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే శరీరానికి సరైన పోషకాలు అందించాలి. ఆహారం: విటమిన్‌ బి6 లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఆకుపచ్చని కూరగాయల్లో బి6 సమృద్ధిగా లభిస్తుంది. వారంలో మూడుసార్లు.. అవి తీసుకుంటే మంచిది.   ఫోలిక్‌ ఆమ్లం కూడా జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. యాపిల్‌, నారింజ, బీన్స్‌, బ్రకోలీ.. తరచూ తీసుకోవాలి.  అల్పాహారంతో పాటు.. పాలకూర, క్యాలీఫ్లవర్‌ రసం కలిపి తీసుకోవాలి.   ఉదయం క్యారెట్‌ ముక్కలు... మధ్యాహ్నం భోజనంతోపాటు క్యారెట్‌ రసం తీసుకోవాలి. చిట్కాలు: తలస్నానం పూర్తయ్యాక... కొబ్బరి నూనెను వేడిచేసి మునివేళ్లతో మాడుకు మర్దన చేయాలి.   మూడు రోజులకోసారి గోరువెచ్చటి కొబ్బరి నూనెకు నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించాలి. రెండు రోజులకోసారి రాత్రిపూట శిరోజాలకు ఆముదం పట్టించి మర్నాడు వేడి నీటితో శుభ్రపరచాలి. దీనివల్ల కేశాలు.. బలంగా ఒత్తుగా పెరుగుతాయి.  గ్లాస్‌ నీళ్లలో కప్పు పచ్చి బఠాణీలను నానబెట్టి మర్నాడు గ్రైండ్‌ చేసి తలకు పట్టించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: