తేనె, నిమ్మరసం కలిపి సేవిస్తే సరి, లావుగా ఉన్నవారు సన్నబడతారు, అయితే ఎసిడిటి ఉండకూడదు. బరువు తగ్గడానికి మందులేమీ ఉండవు. పీచు పధార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే లావు కావాలనుకున్నవారు రాత్రిపూట గ్లాసుడు గోరువెచ్చని పాలలో ఒక స్పూను తేనె వేసి తాగాలి. లావుగా ఉన్నవారు సన్నపడాలంటే నిత్యం మునగాకు రసం తాగుతూ ఉండాలి.

ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. మార్కెట్ లో ఉండే పలురకాల ఆహార పధార్థాలు ఫ్యాకులపై తక్కువ కెలోరిలు అని రాసి ఉంటుంది. దానిని చూసి మోసపోకండి. ఉదాహరణకు తీపి పధార్థాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండి తీపి అధికంగా ఉండవచ్చు. దీనితో తీపిశాతం శరీరంలో చేరినట్టే కదా!

అందుకని ఆహారం ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటచేస్తున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వంటకాలలో వేసే నూనె తగ్గించాలి. వెన్న, నెయ్యి కూడా మితంగా వాడటం అలవాటు చేసుకోండి. ఆకలిగా అనిపిస్తే కొందరు బిస్కెట్లు, చిప్స్ తినేస్తుంటారు.

వీటి బదులు ఏదైనా పండు లేదా తాజా కూరగాయలు తీసుకోవడం ప్రారంభించండి. సాధ్యమైనంతవరకు నడవడానికి ప్రధాన్యం ఇవ్వండి. తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దాహంగా అనిపించకపోయినా తరచు నీరు తాగుతూ ఉండాలి. అందువల్ల శరీరానికి అవసరమైన ద్రవపధార్థాలు అందుతాయి.

కూల్ డ్రింక్ ల కన్న కొబ్బరినీరు, పండ్లరసాలు తీసుకోవడం మంచిది. పెరుగు వాడితే రక్తప్రవాహంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పెరుగుపై ఉండే నీటితేట ఆరోగ్యానికి మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: