మంచి పోషకాహారం తీసుకోవడం తో చర్మం బ్రైట్ నెస్ గా మారుతుంది. మీ ముఖాకృతి తాజాగా మెరవడానికి పోషకాహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు అంటున్నారు.


నిమ్మరసం చిట్కా : చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచి, వ్రింకిల్స్ పడనీయకుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.


ఎగ్ చిట్కా : రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు ఆరోగ్యనిపుణులు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపు దేలి మెరుస్తుంది.


తేనెతో చిట్కా : ప్రతి రోజు ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూను తేనె వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజు ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.  


స్ట్రాబెర్రీస్ ఫలితం : ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగు సార్లు ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్ 'సి' యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.


అరటి పళ్లు : రోజు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తినేటప్పుడు చిన్న ముక్కతో ముఖమంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: