చాలామంది చెమ‌ట ఎక్కువుగా ఎండాకాలంలో మాత్ర‌మే అంద‌రిని ఇబ్బంది పెడుతుంద‌ని భావిస్తుంటారు. అయితే చెమ‌టతో ఎండాకాలంలో మాత్ర‌మే కాదు... చ‌లికాలం...వ‌ర్షాకాలంలో కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. బాడీ నుంచి వ‌చ్చే చెమ‌ట కంపుతో డ్రెస్సంతా త‌డిచిపోయి కంపుకొడుతూ ఉంటే న‌లుగురిలోకి వెళ్ల‌లేక‌, వారితో ఫ్రీగా మూవ్ అవ్వ‌లేక ఇబ్బంది పెడుతూ ఉంటారు. 


ఇక చెమ‌ట నుంచి త‌ప్పించుకునేందుకు చాలా మంది బాడీ స్ప్రేలతో పాటు ర‌క‌ర‌కాల కెమిక‌ల్స్ స్ప్రేలు వాడుతూ అనారోగ్యాల‌కు గుర‌వుతుంటారు. వీటి వ‌ల్ల స్కిన్‌కు ఇబ్బంది కూడా వ‌స్తుంటుంది. అయితే చెమ‌ట నుంచి ఇబ్బంది లేకుండా త‌ప్పించుకునేందుకు మ‌నం ఇంట్లోనే చిన్న చిట్కా పాటిస్తే స‌రిపోతుంది. ఎక్కువుగా చెమ‌ట‌తో ఇబ్బందికి గురయ్యే వారు ఆహార విషయంలో కొద్ది జాగ్రత్రలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడ‌వ‌చ్చు. ఈ క్రింది ఫుడ్‌తో చెమ‌ట‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Image result for అల్లం

అల్లం :సుగంధ ద్ర‌వ్యాల‌లో ఒక‌టి అయిన అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువుగా ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది.

Image result for ఆరంజ్

ఆరెంజ్:ఆరెంజ్ పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది. 

Image result for నిమ్మ‌ర‌సం

నిమ్మ‌ర‌సం:ఆరెంజ్ లాగే నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారిస్తుంది.

Image result for ఆపిల్

యాపిల్స్ :యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు టాక్సిన్స్ బయటకు పంపుతాయి. దీనితో చెమట వాసన దూరమౌతుంది.

Image result for కొత్తిమీర

కొత్తిమీర‌:కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుంచి విముక్తి కల్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: