చలికాలంలో ఎక్కువగా అందరిని భాదించేది చర్మ సమస్యలే..ఈ కలం వస్తుందంటే చాలు..పేస్ జెల్స్..లోషన్స్..కి ఎక్కువగా గిరాకీ ఉంటుంది అయితే చాలా మంది ఈ కాలంలో చలి ద్వారా మాత్రమే ఇలా చర్మం పొడిబారుతుంది అనుకుంటారు ..కానీ ఈ కాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మనం ఉపయోగించే మందులు కానీ రోజు చేసే కార్యకలాపాలు కానీ ఈ విషయం లో ప్రభావాన్ని చూపిస్తాయి.

Image result for winter session

చలికాలంలో ఉదయాన్నే లేచి నీటిని ముట్టుకోవాలంటేనే తెగ బయపడిపోతారు..ఈ కాలంలో..స్నానం చేయాలంటే తప్పనిసరిగా వేడినీటిని వాడుతారు అందరు కానీ ఆ వేడినీరు మీ చర్మాన్ని మృదుత్వం నుంచీ దూరం చేస్తుందని చాలా మందికి తెలియదు. సహజ సిద్దంగా ఉండే మన ముఖాన్ని పొడిబారేలా చేస్తుంది..మరి ఎలా చలి నుంచీ తప్పించుకునేది అంటే వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

Image result for winter problems

మార్కెట్ లో దొరికే చాలా స్కిన్ క్రీమ్స్ లో ఆల్కహాల్ వాడుతూ ఉంటారు..ఈ ఉత్పత్తులు వాడటం వలన చర్మం సహజ తేమని కోల్పోయి..పొడిగా మారిపోతుంది..అందుకే ఆల్కహాల్ఉత్పత్తులు వాడకం మంచిది కాదు వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.


పొడి చర్మం అనేది జీన్స్ ని బట్టికుడా వస్తుంది..మన కుటుంభంలో ఎవరికైనా అలాంటి చర్మం ఉన్నా సరే వారి వల్లకూడా రావచ్చు.. కొవ్వుని కరిగించే మందుల వాడకం వలన కూడా చర్మం పొడిగా మారుతుంది. అందుకే వీలైనంత వరకు మీ చర్మానికి హానికలిగించే రసయానిక పదార్ధాలని దూరం పెట్టండి..సహజసిద్దమైన పద్దతులు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: