మీరు ఎప్పుడైనా మీ ముఖంలో మార్పులు గమనించారా..అద్దంలో ముఖాన్ని చూసుకుని ఒక్కసారి మీ చర్మాన్ని పరీక్షుంచుకోండి..కాళ్ళకింద నల్లని చారలు లేదా చర్మం అక్కడక్కడా నలిగినట్టుగా ముడతలు పడటం..ఒక్కోసారి సాగినట్టుగా ఉంటుంది..ఈ పరిణామాలకి వయస్సుతో సంభందం లేదు..కానీ చాలా ఎదుర్కునే సమస్య ఇది రోజు వారి పనివత్తిడి వలన కానీ.నిద్ర లేమి వల్లకానీ ఇలా అనేకరకాలుగా అలసినప్పుడు చర్మం వాదులు అవుతుంది.మీరు ఎంత ఒత్తిడికి గురయ్యినా సరే కొంతసమయం మీ శరీర చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.

 

 

అయితే మనకి పనికిరావు అనే బయటపడేసే పండ్ల తొక్కలతో ఈ చర్మ సమస్యలకి చెక్ పెట్టచ్చు..వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతాయి కూడా. అయితే వీటిలో ముఖ్యంగా దానిమ్మ పండు తొక్క చర్మాన్ని కాపాడటం లోను..చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడం లోను ఎంతో ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు.

 

దానిమ్మ తొక్కలో  ఎన్నో  యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ గుణాలు చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్లని తగ్గించేందుకు..ఎంతో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా చర్మాన్ని వదులు అవ్వకుండా చర్మాన్ని పట్టి ఉంచి  ముడతలని క్లియర్ చేస్తుంది. అంతేకాదు ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చి  యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దానిమ్మ తొక్క మన చర్మం లోపల ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గించి చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది.

 

దానిమ్మ తొక్కతో ఫేస్ ప్యాక్ చేయడం చాలా సులభం ఒకదానిమ్మకాయపై ఉండే తొక్కని తీసి మెత్తగా దంచి ఒక స్పూన్ ముడిసెనగల పొడి..ఒక స్పూన్ తొక్కల మిశ్రమం..రెండు స్పూన్ల మంచి గంధం పొడి వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించండి..ఒక అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం వలన మీ చర్మంపై ముడతలు ఉన్నా..నల్లటి వలయాలు ఉన్నా సరే మటుమాయం అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: