చాలా మంది ముఖం గగ్గురు గగ్గురుగా..చాలా మందంగా..ఉంటుంది.అంతేకాదు కొంతమందికి చర్మం మీద రంద్రాలు గా ఏర్పడుతుంది. మరికొంతమందికి చర్మం సాగినట్టుగా కనపడుతుంది.దీనికి ప్రధానమైన కారణం చర్మ గ్రంధులు మూసుకుని పోవడమే..చర్మం ఇలా మూసుకుని పొతే ముఖం మీద మొటిమలు..బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తాయి.అయితే చర్మ రంధ్రాలు ఇలా మూసుకుని పోవడానికి కారణం కాలుష్యం.

 

బయటకి వెళ్ళినప్పుడు గాలిలో కాలుష్యపదార్ధాలు చర్మం పై భాగంలో ఉండిపోతాయి.అంతేకాకుండా మృతకణాలు కూడా రంధ్రాలను మూసుకుపోయేట్లా చేస్తాయి.అలా రంధ్రాలు మూసుకుపోయి, వాటిని ఎక్కువకాలం అలానే వదిలేస్తే, మీ ఆరోగ్యం, అందంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే  మీ చర్మరంధ్రాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చర్మం మీద మట్టి పేరుకుని పోకుండా చూసుకోవాలి. ఇలా జరగాలి అంటే చర్మ సంరక్షణకై వాడే సాధనాలు సహజసిద్ధంగా ఉండాలి.చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.అయితే ముఖం మీద ఏర్పాడే ఈ రంద్రాలని పూడ్చడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి..అలా చేస్తే చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.

 

 

నిమ్మరసం మరియు కొబ్బరినూనెలు ముఖం మీద మొటిమల నివారణ చేసి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.చర్మంపై ఇన్ఫెక్షన్ కి కారణం అయ్యే బ్యాక్టీరియాని కూడా నాశనం చేస్తాయి.దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే అనేకరకాల రసాయనాల సౌందర్య సాధనాలు వస్తున్నాయి..మరి పూర్వం సౌందర్య సాధనాలుగా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో తాయరు చేసుకునే వారు..వీటిని ఉపయోగించి మీ అందాన్ని కాపాడుకునే పద్దతిని తెలుసుకోండి.

 

 

ముందుగా మీరు మీ ముఖాన్ని..గోరువెచ్చని నీటితో కడగాలి.. ఒక స్పూన్ మంచి కొబ్బరి నూనె తీసుకుని..దానికి ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.ముఖంపై ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని పట్టించండి.ఇలా చేసిన తరువాత  5-10 నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తరువాత రెండు నిమిషాలు ఆరనివ్వాలి.

 

ఆరినతరువాత అది ముఖంపైన నీటి తెట్టులా కట్టి మాస్క్ లా తయారవుతుంది.అప్పుడు గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో ఒక కాటన్ గుడ్డ ముంచి తుడుచుకుంటూ ఉండాలి..ఇలా సుమారు వారానికి 3 నుంచీ 4సార్లు ఇలానే చేస్తే చర్మంపై ఉండే చెడు కణాలు పోతాయి..మొటిమలు ఏర్పాడే దశలో ఉన్నాసరే వాటిని నిర్మూలిస్తుంది..ఒక నెల రోజుల వరకు ఇలా చేస్తే మీ చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: