జుట్టు మనిషి అందాన్ని  మరింత అందంగా కనిపించేలా చేస్తుంది..ఎంత అందంగా ఉన్న మనిషి అయినా సరే జుట్టు సరిగా లేకపోతె  అందవిహీనంగా కనిపిస్తారు.చాలా మందికి జుట్టు పొడిబారి పోతుంది..ఒక్కోసారి జుట్టు జిడ్డ్డు గా మారిపోతుంది. అలా కాలక్రేమేనా జుట్టు రాలిపోయి  తలమీద వెంట్రుకలు అన్నీ ఊడిపోతాయి.ఈ పరిస్థితి నుంచీ ఉపసమనం కలగాలి అంటే గుడ్డు తో తయారు చేసిన మాస్క్లు  చాలా బాగా ఉపయోగపడుతాయి.

 hair fall కోసం చిత్ర ఫలితం

ఎంతో సున్నితంగా ఉండే వెంట్రుకలు చాలా మందిలో పలచన పడుతూ ఉంటాయి. వెంట్రుకలకి కాలసిన ప్రోటీన్స్ అన్ని గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. ఫాటీ ఆసిడ్ లతో పాటూ విటమిన్ 'D', 'A' మరియు 'E' లు గుడ్డులో ఉండటం గుడ్డు యొక్క ప్రత్యేకత. ఈ విటమిన్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి..జుట్టు బలంగా ఉండటానికి ఈ పచ్చసోన లో ఉండే ఈ ప్రోటిన్స్ జుట్టుని మృదువుగా మారుస్తాయి.

 alive oil కోసం చిత్ర ఫలితం

జుట్టుబలం కోసం వాడే  హెయిర్ ప్యాక్ కి  కావలసిన పదార్థాలు:

 

2 స్పూన్స్  ఆలివ్ ఆయిల్, 1 కప్పు నీరు...2 గుడ్ల యొక పచ్చసొన,

ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పచ్చసొనను కలిపి అందులోనే , ఆలివ్ ఆయిల్ కలపాలి.ఇప్పుడు రెండిటినీ బాగా కలిపి దానిలో సగం కప్పు నీటిని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్ళతో తలపై చర్మం కి అందేలా అద్దాలి.ఈ మిశ్రమాన్ని తలపై చర్మానికి పూసిన తరువాత ఒక పావు గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వాల్ల  జుట్టు కాంతివంతంగా తయారవుతుంది.ఇలా కనీసం నెలలో మూడు వారాలు అయినా సరే చేస్తే మీ జుట్టు చాలా ధృడంగా ఉంటుంది.

 

 egg hair pack కోసం చిత్ర ఫలితం

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: