పుదినా దీనిని ఎక్కువగా కూరలలో రుచులకి వాడుతారు..పుదినాతో పచ్చడి కూడా చేస్తారు..వేసవి కాలంలో పుదినా నెలలు ఎండ తీవ్రతని తగ్గిస్తాయి.అయితే ఈ పుదినాని వాడటం వలన మెరుగైన అందం కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా పుదీనాని అందం మెరుగు పరిచే పేస్ క్రీములలో..ఇతరాత్ర లోషన్స్ లో వాడుతున్నారు. అయితే మన చర్మ అందం మరింతగా మెరుగుపడటానికి పుదినాని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

mint leaves face care కోసం చిత్ర ఫలితం

 

పుదినా నూనెలో చర్మం నిర్జీవంగా తయారయ్యినా సరే తిరిగి మళ్ళీ ఆ చర్మాన్ని మెరుగుపరచగల శక్తి ఉంది. అంతేకాదు అవాంచిన కణాలని తొలగించి చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తాయి. అయితే ఈ పద్దతిని ఎలా ఉపయోగించాలో చుడండి..కొన్ని చుక్కల పుదీనా నూనెను నేరుగా చర్మానికి వాడి..మర్దనా చేయండి. ఆ తరువాత గాలికి ఆరబెట్టి ముఖాన్ని కడుక్కోవాలి..తరువాత మార్పులను గమనించండి.చర్మం టైట్ గా చాలా మృదువుగా అవుతుతుంది.

 

అంతేకాదు ఈ పుదినా జుట్టు పెరుగుదలలో కూడా కీలకంగా పనిచేస్తుంది.మీరు రోజు వారి వాడే నూనెలో కొంత పుదినా నునే కలపండి...ఆ తరువాత వెంట్రుకలకి ఈ నునే వాడటం వల్ల. రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల కూడా బాగుటుంది...మీ జుట్టు పొడిగా ఉన్నట్లయితే...పుదీనా నూనెతో జుట్టు మెత్తబడుతుంది...దీని కోసం గానూ, రోజు వాడే కొబ్బరి నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనెను కలిపి జుట్టుకి అప్లై చేయండి. మీ చర్మం  జిడ్డుగా  ఉంటే  కనుకా ఆపిల్ సైడర్ కు కొద్దిగా పుదీనా నూనెను కలిపి చర్మాన్ని అప్లై చేయండి..మీ చర్మం ఎప్పడు జిడ్డు బారదు..మేలిమి ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది.

  సంబంధిత చిత్రం


మరింత సమాచారం తెలుసుకోండి: