“గ్రీన్ టీ” ఈ పదం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది..అసలు ఈ గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంతో మందికి తెలియదు..అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది...కొంతమందికి తెలుసు కానీ మనం  వాడేసిన “గ్రీన్ టీ”  బ్యాగ్గులతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు..మరి గ్రీన్ టీ తో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం..

 Related image

మీరు “గ్రీన్ టీ” త్రాగిన తరువాత వాడేసిన గ్రీన్ టీ బ్యాగులని చల్లని నీటిలో నానబెట్టి...వాటిని కళ్ల కింద వచ్చే వాపులకు తగ్గించేందుకు వాడొచ్చు. అలసట వల్ల కళ్ల కింద ఉన్న లేత చర్మంపై వాపు వస్తుంది. అలాగే నల్లటి వలయాలు కూడా వస్తాయి. ఆ నల్లటి వలయాలు పోవడానికి ఈ గ“గ్రీన్ టీ” బ్యాగ్గులు ఎంతో ఉపయోగపడుతాయి.

 Image result for green tea bags for dark circles before and after

“గ్రీన్ టీ” లో  ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వచ్చే నల్లటి మచ్చలని..గీతలు పడిన చర్మాన్ని..ముడతల్ని తగ్గిస్తాయి. అందుకే రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి...అయితే ఈ చిట్కాలు ఎక్కువగా టీనేజ్ లో ఉండేవాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతాయి..మొటిమల సమస్య టీనేజ్ లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాంటి  వాళ్ళు..ముఖంపై ఒక్క మొటిమ కనిపించినా తెగ బాధపడిపోతారు. చల్లటి గ్రీన్ టీ బ్యాగుని ముఖంపై మొటిమలు వచ్చే ప్రాంతాల్లో  పెట్టి కాసేపు ఉంచాలి ఇలా రోజు చేయడం వలన మళ్ళీ మీరు మొటిమలు చూడరు.

 

 

“గ్రీన్ టీ” చర్మంలోని తేమను బయటికి పోకుండా పట్టి ఉంచుతుంది. మలినాలను చర్మ గ్రంధుల ద్వారా బయటికి పంపిస్తుంది. కనుక గ్రీన్ టీ బ్యాగుని ఓపెన్ చేసి చల్లటి నీళ్లలో పొడి వేసి ఆ నీళ్లతో ముఖం కడుక్కోవాలి...ఇలా చేస్తే మీ చర్మం చాలా ఫ్రెష్ గా ఉంటుంది...తలకి స్నానం చేసినప్పుడు గ్రీన్ టీ నీళ్లను కూడా ఉపయోగిస్తే మంచిది. తలకి చక్కగా స్నానం చేశాక..కొన్ని “గ్రీన్ టీ” నీళ్ళు తీసుకుని తలపై చల్లుకుంటే జుట్టు గట్టిపడుతుంది చుండ్రు ఉన్నా పోతుంది..

Image result for green tea hair

మరింత సమాచారం తెలుసుకోండి: