అశ్వగంధ వేళ్లను ముక్కలుగా చేసి, వాటిని నేతిలో వేసి కాచి, ఆ నేయిని పూటకు రెండు తులాల మోతాదులో ప్రతి రోజూ మూడు పూటలా తీసుకున్నా లేదా ఆ నేతిని అన్నంలో కలిపి తింటూ ఉన్నా, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గుతాయి. నరాలు శక్తివంతమవుతాయి.


అశ్వగంధ చూర్ణాన్ని వెన్నపూసలో కలిపి, ప్రరోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే, జుత్తుకు సంబంధించిన పలు సమస్యలు తొలగిపోతాయి. వెంట్రుకల్లోని పెళుసుదనం పోయి, మృదువుగా మారడంతో పాటు ఒత్తుగా పెరుగుతాయి.


ప్రతి ఏటా రెండు మాసాల పాటు అశ్వగంధ చూర్ణాన్ని వాడితే, చక్కని ఆరోగ్యంతో పాటు, నిండు యవ్వనం వారి సొంతమవుతుంది.
అశ్వగంధ చూర్ణానికి సమానంగా దానిమ్మ చూర్ణం పొడిని సమానంగా కలిపి, భోజనం తర్వాత ఒక స్పూను పొడి తేనెతో కలిపి నెలరోజుల పాటు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది.


4 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తేనె, నెయ్యితో క లిపి పాలతో తీసుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో కూడా శరీరం పుష్టిని పొందుతుంది.
ఒక తులం అశ్వగంధ చూర్ణాన్ని నెయ్యి, చక్కెరతో కలిపి సేవిస్తూ, ఆ పైన కప్పు పాలు తాగితే చక్కని నిద్ర పడుతుంది.


అశ్వగంధ చూర్ణాన్ని పాలు, నువ్వులనూనె, నెయ్యి, గోరువెచ్చని నీరు వీటిలో ఏదో ఒక దానితో సేవిస్తూ ఉంటే బాగా బక్కచిక్కిన పిల్లలు సైతం బలంగా తయారవుతారు.


రెండు స్పూన్ల చూర్ణాన్ని పాలతో తీసుకుంటే, పసిపిల్ల తల్లులకు పాలు వృద్ధి అవుతాయి. అశ్వగంధ చూర్ణం, శుద్ధి చేసిన పటిక సమపాళ్లలో తీసుకుని క లిపి, ఒక స్పూను మోతాదులో రోజుకు రెండు సార్లు రుతు సమయంలో తీసుకుంటే తెల్లబట్ల తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: