వేసవికాలలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది..చర్మం సున్నితత్వాన్ని కోల్పయి చాలా మందంగా తయారవుతుంది..అంతేకాదు...శరీరం అంతా కాలిపోతున్నట్టుగా ఉంటుంది..అయితే వీటన్నిటికి చెక్ పెట్టాలని మీరు అనుకుంటే సహజసిదమైన పద్దతుల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది..అందుకు గాను పుచ్చకాయ తో ఫేస్ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడుతాయి..అసలు పుచ్చకాయ ద్వారా చర్మ సౌందర్యం ఎలా చేకూరుతుందంటే..

 Image result for watermelon face mask

పుచ్చకాయలో 90 % ఉండే నీరు మన చర్మానికి తేమను అందివ్వడమే కాక తాజాగా నిగారించేటట్లు చేస్తుంది. ఇందులో ముఖ్య ఖనిజాలు మరియు విటమిన్లయిన పుష్కలంగా ఉంటాయి...ఈసారి మీరు పుచ్చకాయ తీసుకువచ్చినప్పుడు మాస్క్ కి తగ్గట్టుగా కొంత తీసి  ఉంచుకుని ఇప్పుడు చెప్పబోయే మాస్క్ లని చేసి వాడి చూడండి..

 

Related image
పుచ్చకాయ కోసిన తరువాత దానిలో ఎర్రగా కనిపిచేది అంతా కూడా మన చర్మ  రక్షణకి సూర్య తాపం నుంచీ వచ్చే వేడిమి నుంచీ రక్షిస్తుంది..ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం లేదా గుజ్జును ఒక గిన్నెలో వేడి చేసి ఆ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ కీరా రసాన్ని కలపండి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయండి...ఇలా చేయడం వలన చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది..

 Image result for watermelon banana face mask

ఇక పుచ్చకాయ అరటి పండుతో కూడా ఫేస్ మాస్క్ తయారు చేయవచ్చు..అరటిపండులోని బి విటమిన్ కాంప్లెక్స్ ఉండటం వలన ,మొఖంపై వచ్చే మొతిమలని తగ్గిస్తాయి...అయితే ఇదే సమయంలో పుచ్చకాయ ని అరటి పండుని కలిపి వాడటం వలన చర్మం కాంతివంతంగా మెరవడమే కాకుండా మొటిమలు కూడా తగ్గిస్తుంది.. ముందుగా ఒక గిన్నెలో రెండు పుచ్చకాయ ముక్కలను తీసుకోండి. తరువాత సగం అరటిపండును తీసుకుని రెండింటిని కలిపి ముద్ద చేయండి...ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు ఉంచి ఆరిపోయిన తరువాత నీటితో కడిగితే చాలు చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది..
Image result for watermelon aloe vera juice

అదేవిధంగా కలబంద  పుచ్చకాయతో కూడా  ఫేస్ మాస్క్ ని తయారు చేయవచ్చు..ఎండ ద్వారా కలిగే గాయాలు చెమట పొక్కులని తగ్గిస్తుంది...అంతేకాదు చర్మాన్ని తేమగా ఉంచుతుంది...కలబంద ,పుచ్చ కాయ ఫేస్ మాస్క్ తయారు చేయు విధానం..ఒక కలబంద ఆకును తీసుకుని..దానిపై  ఉండే పొరను తొలగించి గుజ్జును తీసేయాలి...ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును కలపండి...రెండు మిశ్రమాలని బాగా కలిపి దీనిని చర్మానికి పట్టించి 20 నిమిషాలు తరువాత చల్లని నీటితో కడిగేయచ్చు.  



 


మరింత సమాచారం తెలుసుకోండి: