ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.
Image result for పచ్చిపాలు, మంచి గంధం
a) అందమైన మోము కోసం పచ్చిపాలతో.. ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.
Related image
b) అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం. ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో.. టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చలికాలంలో చర్మం సహజమెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది.  
Image result for చలికాలం
* చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.

* సబ్బును ఉపయోగించకుండా వీలైనన్నిసార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
Image result for చల్లని నీరు
* పాలు సహజ వైటెనర్‌గా పనిచేసి చర్మం నల్లగా అవకుండా రక్షిస్తాయి. గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి. రోజూ ఇలా చేస్తుంటే... చలి కారణంగా మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.

* ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

* పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

* సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది.
Image result for సెనగపిండి, పాలు
* రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.
ముఖం ప్రకాశవంతంగా అందంగా కనిపించడానికి : మార్కెట్లో రకరకాల సబ్బులూ క్రీములూ దొరుకుతాయి. కానీ వాటి కన్నా చర్మాన్ని శుభ్రపరిచే సహజగుణాలు కలిగిన పసుపు, శనగపిండి, తేనె వంటివి వాడటం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

* అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి, చెంచాడు పసుపు కలపండి. తయారైన మిశ్రమాన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.
Image result for దోసకాయ రసం
* ఒక దోసకాయ తీసుకుని దాని రసం తీయండి. అందులో నాలుగైదు టేబుల్‌స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ ప్యాక్‌ స్వేదరంధ్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.

* ఒక కప్పు పెరుగులో టేబుల్‌స్పూన్‌ తేనె కలపండి. బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
Image result for తేనె
* అరకప్పు గోరువెచ్చటినీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేయండి. మందుల షాపులో దొరికే ఎ, ఇ విటమిన్‌ టాబ్లెట్లను ఒక్కొక్కటి తీసుకొని వాటి పొడిని తేనె, నీళ్ల మిశ్రమంలో వేసి బాగా కలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: