స్త్రీలలో అందాన్ని రెట్టింపు చేసేవి పెదాలు మాత్రమే ముఖంలో ఏ అవయవాలు బాగున్నా లేకపోయినా సరే పెదాలు మాత్రం అందంగా లేకపోతే స్త్రీల అందానికి అర్థం ఉండదు అయితే..కాలానికి తగ్గట్టుగా పెదాలని ఎలా రక్షించుకోవాలి..మృదువుగా, అందంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..అసలు పెదాలు పాడవడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి అనే విషయాలని తెలుసుకుందాం..

 Related image

చాలా మంది ఎక్కువగా పొగ త్రాగడం వలన కానీ మద్యపానం తీసుకోవడం ద్వారా అనేక రకాల చెడు అలవాట్లు వలన పెదాలు ఆరోగ్యం రెండు పాడవుతాయి...అంతేకాదు ముఖ్యంగా  నీటిని శరీరానికి  తగ్గట్టుగా కాకుండా కొంచం కొంచం తీసుకోవడం ఎండ, మరియు కాలుష్య వేడిమి..కూడా ఈ సమస్యలకి ముఖ్య కారణం అవుతాయి..ఆధునిక జీవనశైలిలో భాగంగాఎక్కువ కెఫిన్ తో కూడిఉన్న పానీయాలు సేవించడం వలన కూడా పెదవులు పగిలి రంగు మారిపోతాయి.

 Related image

అయితే మరి పెదాలని కాపాడుకోవడం ఎలా అంటే

పూర్వకాలంలో..ఎటువంటి క్రీములు..ఇప్పుడు లభ్యమయ్యే సౌందర్య సాధనాలు లేకుండానే ఇళ్ళలో దొరకే వారితో సౌందర్య సాధనాలు చేసుకునే వారు..ఇప్పుడు కూడా అటువంటి పద్ధతులనే పాటించి పెదాల సంరక్షణ, మరియు అందాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో చూద్దాం..

 

నిమ్మరసం మరియు తేనే తీసుకుని ఒక “టీ  స్పూన్” తేనెలో ఒక “అర టీ స్పూన్” నిమ్మరసం కలపండి ఈ మిశ్రమాన్ని పెదవులకి రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి..ఇలా చేస్తే పెదవులపై అనవసరపు పొరలు కాని..కాలుష్య ప్రభావం నశించి పెదాలు ఎర్రగా మారుతాయి..

 Image result for lips care tips

అలాగే కలబంద గుజ్జు తో కూడా పెదాల సౌందర్యాన్ని పొందవచ్చు..ఎలా అంటే ఒక కలబంద ఆకును మధ్యకు చీల్చి లోపల ఉండే గుజ్జును తీసి ఒక శుభ్రమైన గాజు సీసాలో వేసి దానిలో కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ కలపాలి ఆ తరువాత కలుపగా వచ్చిన మిశ్రమాన్ని స్టోర్ చేసుకుని ఎప్పుడు అయినా సరే పెదాలకి పట్టించుకోవచ్చు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: