మనిషి అందంగా ఉన్నాడు అంటే ముఖ్యంగా ముఖం మీద ఉండే బుగ్గలని బట్టే తెలుస్తుంది..ముఖానికి అందాన్ని ఇచ్చేవి కేవలం ఒక్క బుగ్గలు మాత్రమే...అందం గా ముఖం కనపడాలి అన్నా ఆకర్షణీయంగా ముఖం ఉండాలన్నా సరే బుగ్గలే ముఖ్య కారణం అయితే అయితే చాలా మందికి బుగ్గలు లోపలకి నొక్కుకు పోవడం లేదా చప్పిగా తయారవ్వడం.. పాలిపోయినట్టుగా ఉండటం ఉండటం జరుగుతుంది..అయితే

 Image result for cheeks

ఈ పరిస్థితికి కారణం సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం మరియు సరైన నిద్ర లేకపోవడం మరియు పోషక ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం ఉంటుంది మనం తీసుకునే ఆహారం, మన దైనందిన జీవితం, మనం చేసే వ్యాయామాల మీద మన ముఖసౌందర్యం ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దామా

 

1. రోజూ ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బుగ్గలకు మర్దన చేస్తే మంచి అందమైన బుగ్గలు మీ సొంతం అవుతాయి

 

2. ఒక యాపిల్‌ను ముక్కలుగా కోసి మెత్తగా పేస్టులా చేయాలి. దీనిని బుగ్గలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. యాపిల్‌లో ఉన్న కొల్లేజిన్ అనే ప్రోటీన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి సహజసిద్ధమైన అందాన్ని ఇస్తుంది.

 Image result for cheeks

 

3. బుగ్గల నిండా గాలిని నింపి 30 నుండి 60 సెకన్ల సేపు అలాగే ఉంచి నెమ్మదిగా గాలిని వదలాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల బుగ్గలు మరింత బుగ్గలు సహజసిద్ధమైన అందంతో మెరుస్తూ ఉంటాయి.

 

4. రోజుకు 5 లేక 6 సార్లు బూరను ఊదటం వలన బుగ్గలకు మంచి వ్యాయామం జరుగుతుంది.

 

 5. ప్రతిరోజు రెండు పూటలా రెండు గ్లాసుల పాలు త్రాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.

 Related image

6. రోజూ స్నానానికి 15 నిమిషాల ముందు రెండు స్పూన్ల వెన్నలో ఒక స్పూన్ పంచదారను కలిపి ముఖానికి బాగా మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు క్రమంతప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

 7. రెండు స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక స్పూన్ గ్లిజరిన్‌ను కలిపి బుగ్గలకు రాయాలి. దీనిలో ఉన్న గ్లిజరిన్ చర్మంపై ఉన్నముడతలను తగ్గించి చర్మం బిగుతుగా అయ్యేలా చేస్తుంది. ఇది బుగ్గలకు సహజసిద్ధమైన పోషణను ఇస్తుంది. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: