చేపలను తినడం వల్ల ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. వారానికి రెండుసార్లు తినడం వల్ల గుండె జబ్బులను నివారించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు తదితర ప్రాణాంతక జబ్బుల నుంచి కాపాడుకోవాలంటే వారానికి రెండుసార్లు చేపలు తినండని అమెరికా హార్ట్ అసోషియేషన్ చెబుతోంది.
Image result for చేపలు apherald
స్త్రీలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని ఒక పరిశోధనలో తేలింది. వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకదని అమెరికా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన  డాక్టర్ గియోవానుసికీ తెలిపారు. 
Image result for చేపలు apherald
అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు. ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఇంకా వారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఎడ్వర్డ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: